Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు.. లైవ్ వీడియో ఎప్పుడైనా చూశారా..?

|

Aug 08, 2024 | 3:58 PM

భారీ భూకంపాలతో జపాన్‌ గురువారం చిగురుటాకులా వణికిపోయింది.. నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వెంటవెంటనే 6.9..  7.1 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.. ఈ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగ్‌లు.. వాహనాలు.. అన్నీ ఊగిపోయాయి.

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు.. లైవ్ వీడియో ఎప్పుడైనా చూశారా..?
Japan Earthquake
Follow us on

భారీ భూకంపాలతో జపాన్‌ గురువారం చిగురుటాకులా వణికిపోయింది.. నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వెంటవెంటనే 6.9..  7.1 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.. ఈ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగ్‌లు.. వాహనాలు.. అన్నీ ఊగిపోయాయి. జనం భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.. కాగా.. భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ NHK తెలిపింది. ఇక క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారీ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. పలు చోట్ల భవనాలు కూలినట్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి..

దక్షిణ జపాన్‌లోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో మొదట 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది . USGS ప్రకారం.. భూకంపం కేంద్రం సముద్రంలో 30 కిలోమీటర్ల లోతులో ఉంది. కొన్ని సెకన్ల తర్వాత, నిచినాన్ నగరానికి ఈశాన్యంగా 20 కి.మీ దూరంలో, 25 కి.మీ లోతులో 7.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.

జపాన్‌కు చెందిన భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ NERV ప్రకారం.. హ్యుగా-నాడా సముద్రంలో ప్రకంపనలు సంభవించినట్లు నివేదించింది.. భూకంపం ప్రభావంతో 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలు, నదులు లేదా సరస్సుల సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే, కగోషిమా ప్రిఫెక్చర్‌లో ఉన్న సెండాయ్ అణు విద్యుత్ ప్లాంట్‌తో ఎలాంటి ప్రమాదం లేదని క్యుషు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. 2024 కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే జపాన్ వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోయింది. జనవరి 1న భారీ భూకంపం తర్వాత.. 155 సార్లు భూమి కంపించింది. అప్పుడు 7.6 తీవ్రతో వచ్చిన భూకంపం దాటికి పలు భవనాలు కూలిపోయాయి. పదుల సంఖ్యలో జనం చనిపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం