నడిసంద్రంలో బోటు బోల్తా.. 65 మంది జలసమాధి

| Edited By:

May 11, 2019 | 1:22 PM

మ‌ధ్య‌ధరా స‌ముద్రంలో బోటు బోల్తాప‌డింది. టునీషియా తీరం ద‌గ్గ‌ర జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో సుమారు 65 మందిశరణార్ధులు చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది. బోటులో ప్ర‌యాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు యూఎన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. లిబియాలోని జువారా నుంచి బోటు మొద‌లైన‌ట్లు ప్రాణాలతో బయటపడ్డవారు తెలిపినట్లు తెలుస్తోంది. బ‌ల‌మైన అల‌లు రావ‌డం వ‌ల్ల బోటు బోల్తా ప‌డిన‌ట్లు వారు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం బోటు పరిధికి మించి ఎక్కటంతో […]

నడిసంద్రంలో బోటు బోల్తా.. 65 మంది జలసమాధి
Follow us on

మ‌ధ్య‌ధరా స‌ముద్రంలో బోటు బోల్తాప‌డింది. టునీషియా తీరం ద‌గ్గ‌ర జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో సుమారు 65 మందిశరణార్ధులు చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది. బోటులో ప్ర‌యాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు యూఎన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. లిబియాలోని జువారా నుంచి బోటు మొద‌లైన‌ట్లు ప్రాణాలతో బయటపడ్డవారు తెలిపినట్లు తెలుస్తోంది. బ‌ల‌మైన అల‌లు రావ‌డం వ‌ల్ల బోటు బోల్తా ప‌డిన‌ట్లు వారు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం బోటు పరిధికి మించి ఎక్కటంతో బోటు గాలులకు తట్టుకోలేక బోల్తా పడిందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు లిబియా నుంచి యూరోప్ మ‌ధ్య ఉన్న జ‌ల‌మార్గంలో సుమారు 164 మంది చ‌నిపోయిన‌ట్లు యూఎన్ సంస్థ వెల్ల‌డించింది.