ఇయర్స్ ఫోన్స్‌తో నిద్ర… యువకుడి పరిస్థితి విషమం

| Edited By:

Mar 09, 2019 | 11:04 AM

తైవాన్‌కు చెందిన ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి ఆ ‘మ్యూజిక్’ వినపడలేదు. తొలుత ఫోన్‌లో సమస్య అనుకున్నాడు. చివరికి సమస్య తనకే వచ్చిందని తెలుసుకున్నాడు. ఇయర్ ఫోన్స్‌తో నిద్రలోకి జారుకున్న అతడికి చెవుడు వచ్చేసింది. దీంతో ఆసుపత్రికి పరుగులు తీశాడు. సమయానికి వైద్యుడిని సంప్రదించడం వల్ల పూర్తిగా చెవిటివాడయ్యే ముప్పు నుంచి తప్పించుకున్నాడు. ట్రీట్మెంట్ తర్వాత మళ్లీ అతను వినగలుగుతున్నాడు. మొబైళ్ల ఇయర్ బడ్స్ పెట్టుకుని నిద్రపోతే […]

ఇయర్స్ ఫోన్స్‌తో నిద్ర... యువకుడి పరిస్థితి విషమం
Follow us on

తైవాన్‌కు చెందిన ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి ఆ ‘మ్యూజిక్’ వినపడలేదు. తొలుత ఫోన్‌లో సమస్య అనుకున్నాడు. చివరికి సమస్య తనకే వచ్చిందని తెలుసుకున్నాడు.

ఇయర్ ఫోన్స్‌తో నిద్రలోకి జారుకున్న అతడికి చెవుడు వచ్చేసింది. దీంతో ఆసుపత్రికి పరుగులు తీశాడు. సమయానికి వైద్యుడిని సంప్రదించడం వల్ల పూర్తిగా చెవిటివాడయ్యే ముప్పు నుంచి తప్పించుకున్నాడు. ట్రీట్మెంట్ తర్వాత మళ్లీ అతను వినగలుగుతున్నాడు. మొబైళ్ల ఇయర్ బడ్స్ పెట్టుకుని నిద్రపోతే పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. తైవాన్‌కు చెందిన డాక్టర్ టియన్ హుజీ మాట్లాడుతూ పగటి వేళల్లో ఎక్కువ సంగీతాన్ని వినడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కానీ రాత్రి వేళ అలా చేస్తే చాలా ప్రమాదం అని తెలిపారు.