మాది మత స్వేచ్ఛ. ఇదే దీపావళికి ప్రతీక.. ట్రంప్

| Edited By: Ravi Kiran

Oct 26, 2019 | 5:08 PM

  దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బౌధ్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటున్నామంటే ఇది మత స్వేచ్ఛకు నిదర్శనమే అన్నారు. శ్వేత సౌధంలో కొంతమంది ప్రవాస భారతీయులతో కలిసి ఆయన దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ఆయా వర్గాలవారి విశ్వాసాలను ఆదరిస్తామని, తమ రాజ్యాంగం కూడా వీరికి ఇందుకు హక్కులను కల్పించిందని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ లక్ష్యం […]

మాది మత స్వేచ్ఛ. ఇదే దీపావళికి ప్రతీక.. ట్రంప్
Follow us on

 

దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బౌధ్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటున్నామంటే ఇది మత స్వేచ్ఛకు నిదర్శనమే అన్నారు. శ్వేత సౌధంలో కొంతమంది ప్రవాస భారతీయులతో కలిసి ఆయన దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ఆయా వర్గాలవారి విశ్వాసాలను ఆదరిస్తామని, తమ రాజ్యాంగం కూడా వీరికి ఇందుకు హక్కులను కల్పించిందని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ లక్ష్యం ఇదే అన్నారు.’ నేను, నా సతీమణి మెలనియా కూడా ఈ దీపాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.. . అంతా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2009 నుంచి వైట్ హౌస్ లో ప్రతియేటా నిరాడంబరంగా దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. వరుసగా పదవిలోకి వస్తున్న అధ్యక్షులు శ్వేత సౌధంలో లాంఛనంగా దీపాలు వెలిగించి ఈ ఫెస్టివల్ సంబరాల్లో పాల్గొంటున్నారు. . కాగా… ఈ సారి అమెరికాలో అక్కడి కాలమానం ప్రకారం దాదాపు రెండు రోజులముందే దీపావళి వచ్చింది. భారత్ లో ఈ నెల 27 న (ఆదివారం) దేశ వ్యాప్తంగా ఈ పండుగ జరుపుకొంటున్నారు. అయితే గ్రహరాశుల ప్రకారం.. సోమవారం ఈ ఫెస్టివల్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని పంచాంగాలు ఆదివారమని రాస్తే మరికొన్ని సోమవారమని పేర్కొనడం గమనార్హం.