Watch Video: అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే..

|

Jul 20, 2024 | 4:49 PM

బంగ్లాదేశ్‌ అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఎత్తేయాలంటూ అక్కడి విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు హింసకు దారి తీశాయి. దీంతో అక్కడ భారతీయ విద్యార్థులు సరిహద్దులు దాటి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అక్కడి పరిస్థితులపై వారు భయందోళనలు వ్యక్తం చేశారు.

Watch Video: అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే..
Bangladesh
Follow us on

బంగ్లాదేశ్‌ అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఎత్తేయాలంటూ అక్కడి విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలు హింసకు దారి తీశాయి. దీంతో అక్కడ భారతీయ విద్యార్థులు సరిహద్దులు దాటి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అక్కడి పరిస్థితులపై వారు భయందోళనలు వ్యక్తం చేశారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిలో భారతీయులతో పాటు నేపాల్‌, భూటాన్‌వారు కూడా ఉన్నారు.

1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాట యోధుల వారసులకు ప్రధాని షేక్‌ హసీనా 30శాతం రిజర్వేషన్లు ప్రకటించడాన్ని అక్కడి విద్యార్థి సంఘాలు నిరసిస్తున్నాయి. మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకూ వంద మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. బంగ్లా ప్రభుత్వం పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపింది. మరోవైపు ఢాకాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం హింసకు పాల్పడటాన్ని నిరసిస్తూ ఢిల్లీలో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రదర్శన చేపట్టాయి. బంగ్లా విద్యార్థి సంఘాలను తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. వారి పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ నినాదాలు చేస్తూ విప్లవ గీతాలు ఆలపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.