వైరస్‌ రూపాంతరం.. ఏడాదికో కొత్త వ్యాక్సిన్‌ కావాల్సిందేనా!

| Edited By:

Aug 11, 2020 | 7:40 AM

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్‌ వస్తేనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు అంటున్నారు

వైరస్‌ రూపాంతరం.. ఏడాదికో కొత్త వ్యాక్సిన్‌ కావాల్సిందేనా!
Follow us on

Coronavirus vaccine lifetime: ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్‌ వస్తేనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఈ లోపే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదేంటంటే వచ్చే వ్యాక్సిన్ జీవితకాలం ఎంత అని.? వైరస్ రూపాంతరం అవుతున్న వేళ వ్యాక్సిన్ శక్తి ఒక ఏడాదికే పరిమితం అయినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

ఉదాహరణ తీసుకుంటే ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌కి 1930లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 1990 తరువాత ఈ వ్యాక్సిన్‌ అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫ్లూ వైరస్‌ అత్యంత వేగంగా మార్పు చెందుతుండటంతో ప్రతి సంవత్సరం వ్యాక్సిన్‌ని అందుకు తగ్గట్లుగా మార్పు చేయాల్సి వస్తోంది. అంతేకాదు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక కరోనాకు సైతం ఇలానే తరుచుగా వ్యాక్సిన్‌ చేయించుకోవల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ దానిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లూ వైరస్ అంత వేగంగా కరోనాలో మార్పులు లేకున్నా, ఈ వైరస్ మాత్రం రూపాంతరం చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, వైరస్ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు. అప్పుడు వ్యాక్సిన్‌లో మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Read This Story Also: వచ్చే నెలలో ఏపీలో తగ్గనున్న కరోనా!