ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు చేరువైన కరోనా కేసులు..

|

Sep 23, 2020 | 7:12 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు చేరువైన కరోనా కేసులు..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,850,771కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 976,589 మంది కరోనాతో మరణించారు. ఇక 23,451,010 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Corona Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,098,766కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 205,503మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 5,664,527 కేసులు నమోదు కాగా.. 90,210 మంది వైరస్ కారణంగా మరణించారు.