మరో షాకింగ్ న్యూస్‌.. చెవుల్లోనూ కరోనా వైరస్‌..!

| Edited By:

Jul 25, 2020 | 7:13 PM

ఇప్పటివరకు ముక్కు, నోరు ద్వారానే కరోనా శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించేవారు. అయితే శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశంపై శాస్త్రవేత్తలు మరో విషయాన్ని వెల్లడించారు.

మరో షాకింగ్ న్యూస్‌.. చెవుల్లోనూ కరోనా వైరస్‌..!
Follow us on

ఇప్పటివరకు ముక్కు, నోరు ద్వారానే కరోనా శరీరంలోకి ప్రవేశిస్తుందని భావించేవారు. అయితే శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశంపై హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్ శాస్త్రవేత్తలు మరో విషయాన్ని వెల్లడించారు. చెవుల ద్వారా కరోనా వ్యాపిస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సోకి మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్‌(చెవి లోపల వెనుక భాగంలోని మెత్తని ఎముకతో కూడిన ప్రాంతం)లో కరోనా వైరస్‌ని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు పరిశోధకులు గుర్తించారు. ముగ్గురిపై వీరు పరిశోధన చేస్తే ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనక చెవిలో కూడా వైరస్‌ శాతం ఎక్కువగా ఉందని కనిపెట్టారు. అయితే కరోనా తీవ్రత పెరిగినప్పుడు రోగి శరీరం నుంచి వైరస్ చెవుల్లోకి వెళుతోందా..? లేక చెవుల నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుందా..? అన్న సందేహాలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరికొంతమందిని పరిశీలిస్తే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదని వారు అంటున్నారు. ఇంతకు ముందు జరిపిన పరిశోధనల్లో కరోనా పేషంట్లకు చెవిపోటు, వినికిడి లోపం వంటి లక్షణాలను కనుగొన్నారు. కరోనా సోకక ముందు వినికిడి సమస్య లేకపోయినా కరోనా వచ్చాక మాత్రం ఎంతో కొంత వినికిడి సామర్థ్యం తగ్గిందని రుజువైంది.