వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం.. కామన్వెల్త్ వేదికపై నాసిర్ అలీ ఖాన్ కీలక ప్రసంగం

లండన్‌లోని మార్ల్‌బరో హౌస్‌లో జరిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ లాంగేవిటీ అండ్ హెల్తీ ఏజింగ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ప్రత్యేక అతిథిగా, వక్తగా హాజరయ్యారు. ప్రపంచ ఆరోగ్యం, ఆయుర్దాయం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, వైద్యరంగంలో వినూత్న మార్పులు, అంతర్జాతీయ వైద్య సహకారం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు.

వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం.. కామన్వెల్త్ వేదికపై నాసిర్ అలీ ఖాన్ కీలక ప్రసంగం
Dr. Nawab Mir Nasir Ali Khan Addresses Commonwealth Global Summit

Updated on: Oct 02, 2026 | 8:14 AM

లండన్‌లోని చారిత్రాత్మక మార్ల్‌బరో హౌస్‌లో ఉన్న కామన్వెల్త్ సచివాలయంలో (Commonwealth Secretariat) ఘనంగా జరిగిన ‘కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ లాంగేవిటీ అండ్ హెల్తీ ఏజింగ్’ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కజకిస్థాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సుల్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ప్రత్యేక అతిథిగా, వక్తగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యం, ఆయుర్దాయం పెంపు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, వైద్యరంగంలో వస్తున్న వినూత్న మార్పులు, భవిష్యత్తు వైద్య సంరక్షణపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. కామన్వెల్త్ దేశాలతో పాటు ఇతర అంతర్జాతీయ వైద్య నిపుణులు, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకులు, రాయబారుల సమక్షంలో ఈ సమ్మిట్ జరిగింది.

అంతర్జాతీయ సహకారం అత్యంత అవసరం: నవాబ్ నాసిర్ అలీ ఖాన్

సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగంలో విస్తృత భాగస్వామ్యం, విజ్ఞాన మార్పిడి అవసరమని పునరుద్ఘాటించారు. గ్లోబల్ హెల్త్ సవాళ్లను అధిగమించడానికి, ప్రజల జీవిత కాలాన్ని, జీవన ప్రమాణాలను పెంచడానికి దేశాల మధ్య నిరంతర చర్చలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కామన్వెల్త్ వేదికపై మాట్లాడే అవకాశం లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Commonwealth Medical Association

కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ (CMA): 1962లో స్థాపించబడిన ఈ సంస్థ, కామన్వెల్త్ పరిధిలోని జాతీయ వైద్య సంఘాలకు మద్దతు ఇస్తూ, వైద్య సేవలు, నీతి నియమాలను పెంపొందించడానికి పనిచేస్తోంది.

లండన్‌లోని మార్ల్‌బరో హౌస్ కేంద్రంగా పనిచేసే Commonwealth Secretariat సంస్థ, 56 స్వతంత్ర దేశాల భాగస్వామ్యంతో ఆరోగ్యం, విద్య, ప్రజాస్వామ్యం, సుస్థిర అభివృద్ధి రంగాలలో సహకారాన్ని అందిస్తోంది. అయితే.. భారత్‌, కజకిస్థాన్‌ల తరఫున అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, వైద్యరంగ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ వహిస్తున్న పాత్రకు ఈ కామన్వెల్త్ సమ్మిట్ ఆహ్వానం ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us