5 జీ టెక్నాలజీతో సర్జరీ.. చైనాదే ఈ ఘనత !

| Edited By: Srinu

Jun 12, 2019 | 5:05 PM

ఇప్పటివరకు మనం సెల్యులార్ టెక్నాలజీలో 4 జీ టెక్నాలజీ గురించే విన్నాం.. ఎల్ ఈ టీ నెట్ వర్క్ లో ఈ టెక్నాలజీ వినియోగం మనకు అలవాటవుతోంది. అయితే దీనికన్నా 10 నుంచి 100 రెట్లు అత్యంత వేగం గల డౌన్ లోడ్ స్పీడ్ తో ‘ వచ్ఛేతరం ‘ 5 జీ సెల్యులార్ టెక్నాలజీకి భవిష్యత్తు మార్గం సుగమం చేస్తోంది. చైనా డాక్టర్లు ఈ విషయంలో అప్పుడే ముందడుగు వేశారు. ఈ నెట్ వర్క్ ను […]

5 జీ టెక్నాలజీతో సర్జరీ.. చైనాదే ఈ ఘనత !
Follow us on

ఇప్పటివరకు మనం సెల్యులార్ టెక్నాలజీలో 4 జీ టెక్నాలజీ గురించే విన్నాం.. ఎల్ ఈ టీ నెట్ వర్క్ లో ఈ టెక్నాలజీ వినియోగం మనకు అలవాటవుతోంది. అయితే దీనికన్నా 10 నుంచి 100 రెట్లు అత్యంత వేగం గల డౌన్ లోడ్ స్పీడ్ తో ‘ వచ్ఛేతరం ‘ 5 జీ సెల్యులార్ టెక్నాలజీకి భవిష్యత్తు మార్గం సుగమం చేస్తోంది. చైనా డాక్టర్లు ఈ విషయంలో అప్పుడే ముందడుగు వేశారు. ఈ నెట్ వర్క్ ను ఉపయోగించి ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఓ రోగికి గాల్ బ్లాడర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 200 కి. మీ. దూరం నుంచి ఓ ఆస్పత్రిలో ఇదే టెక్నాలజీని వినియోగిస్తూ.. ఆ ప్రాంతంలోని వైద్యులకు సూచనలు చేస్తూ ఈ ఆపరేషన్ చేయడం వారికే చెల్లింది. (ఈ సర్జరీనే ‘ లాప్రోస్కోపిక్ ఖోలిసిస్టెక్టోమీ అని కూడా వ్యవహరిస్తారు). ఉత్తర చైనా హుబీ ప్రావిన్స్ లోని గ్రామంలో ఒక రోగికి సుమారు గంటపాటు ఈ సర్జరీ జరిగింది. చైనాలోని నాలుగు టెలికాం దిగ్గజాల్లో ఒకటైన ‘ చైనా మొబైల్ ‘ 5 జీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఈ నెల 6 న లైసెన్సు పొందింది. ఈ టెక్నాలజీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడంతో మొత్తం సర్జరీ ప్రక్రియ సులభతరమైంది. షియాన్ సిటీలోని తైహే ఆసుపత్రిలో గల నిపుణుల బృందానికి లైవ్ ఫీడ్ ద్వారా మొదట దీన్ని ట్రాన్స్ మిట్ చేశారు. ఈ నెట్ వర్క్ ఆలస్యం కాలేదని, ఆపరేషన్ అనంతరం పేషంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సర్జికల్ బృందం తెలిపినట్టు సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది.
ట్రాన్స్ మిట్ అయిన వీడియోలు, ఫోటోల క్లారిటీకి 5 జీ టెక్నాలజీ గ్యారంటీ ఇస్తోందని, ఈ నెట్ వర్క్ ద్వారా డాక్టర్లు ఎంత దూరంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా ఇతర డాక్టర్లకు సహకరిస్తూ సర్జరీలు నిర్వహించవచ్చునని ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. రవాణా, ఎంటర్ టైన్మెంట్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో చైనా ఈ నెట్ వర్క్ ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు హుబీ ప్రావిన్స్ లో 300 కు పైగా 5 జీ బేస్డ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీ సిగ్నల్ కవరేజీ చాలా బాగుందని, రాజధాని బీజింగ్ లో 4,300  5 జీ బేస్డ్ కేంద్రాలు ఉన్న దృష్ట్యా ఈ విధమైన నెట్ వర్క్ ఈ రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వారు చెబుతున్నారు. సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ కోసం తహతహలాడుతున్న చైనా ప్రభుత్వం టెలికాం సంస్థలకు 5 జీ లైసెన్సులు జారీ చేయడం ప్రారంభించింది.