షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని వీగర్‌ వర్గంపై చైనా అణచివేత చర్యలు, బోధనాభాషగా తొలగిస్తూ తాజా నిర్ణయం

|

Feb 01, 2021 | 12:45 AM

షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని వీగర్‌ వర్గంపై చైనా సరికొత్త అణచివేత చర్యలు చేపట్టింది. తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది...

షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని వీగర్‌ వర్గంపై చైనా అణచివేత చర్యలు,  బోధనాభాషగా తొలగిస్తూ తాజా నిర్ణయం
Follow us on

షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని వీగర్‌ వర్గంపై చైనా సరికొత్త అణచివేత చర్యలు చేపట్టింది. తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి స్వయం ప్రతిపత్తి కలిగిన షిన్‌జియాంగ్‌ ప్రాంత ప్రజలు రెండు భాషలను నేర్చుకునే సౌలభ్యం ఉంది. అయితే, స్థానిక బోధనా భాషగా ఉన్న వీగర్‌ను విద్యా సంస్థల్లోనూ తొలగించినట్లు తాజాగా చైనా ప్రకటించింది. దీనిని ఆ దేశ మీడియా కూడా ధృవీకరించింది. అంతేకాదు, విద్యా సంస్థల్లో ఆ భాషను కూడా మాట్లాడకుండా మౌకిక ఆంక్షలు విధించిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే నిర్భంధ క్యాంపుల్లో కాలం వెల్లదీస్తోన్న వీగర్‌ ప్రజలకు తాజాగా నిర్ణయం మరింత ఇబ్బంది కలిగించే పరిణామం. వీగర్ విషయంలో ఇప్పటికే మానవహక్కులను ఉల్లంఘిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న చైనా. గత కొంతకాలంగా షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతుందంటూ అమెరికా విమర్శలు చేస్తోంది. వీటికి నిరసనగా అక్కడి ఉత్పత్తుల దిగుమతిపైనా అప్పటి ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.