ట్రక్కును పేల్చిన ఉగ్రవాదులు.. 19 మంది మృతి

| Edited By:

Oct 07, 2020 | 1:03 PM

ఉత్తర సిరియాలో ఘోరం జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కను ఉగ్రవాదులు పేల్చారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 80 మంది గాయపడ్డారు

ట్రక్కును పేల్చిన ఉగ్రవాదులు.. 19 మంది మృతి
Follow us on

Northern Syria bomb blast: ఉత్తర సిరియాలో ఘోరం జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కను ఉగ్రవాదులు పేల్చారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్‌ బాబ్‌ జిల్లా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ దాడి వెనుక‌ ఐపీజీ గానీ పీకేకే ఉగ్ర‌వాద గ్రూపు గానీ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అల్‌ బాబ్‌ పట్టణంలో దాడి జ‌ర‌గ‌డం వారంలోనే ఇది రెండ‌వ‌సారి. ఆదివారం అక్కడి చెక్ పాయింట్ వ‌ద్ద జ‌రిగిన దాడిలో ఇద్ద‌రు మృతి చెందగా, ఏడుగురు గాయ‌ప‌డ్డారు. కాగా ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ చెర నుంచి 2017లో అల్ బాబ్ ప‌ట్ట‌ణానికి సిరియా ఆర్మీ విముక్తి కలిగించింది. ట‌ర్కీ బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న ఈ ప‌ట్ట‌ణం నుంచి ఉగ్ర‌వాదుల‌ను ఏరి వేసేందుకు 2016లో ఏడు నెల‌ల ఆప‌రేష‌న్ చేప‌ట్టింది సిరియా ఆర్మీ.

Read More:

ఆ ప్రసక్తే లేదు.. ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చిన కాజల్‌

త్రివిక్రమ్‌తో మూడోసారి మహేష్‌.. కన్ఫర్మ్ చేసిన సూపర్‌స్టార్‌‌