ఇరాన్ పై అమెరికా పోరుకు బ్రిటన్ బాసట

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2019 | 2:51 PM

ఇరాన్ పై జరిపే సైనిక దాడికి సహకరించాలని అమెరికా కోరితే అందుకు తాము రెడీగా ఉన్నామని బ్రిటన్ ప్రకటించింది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు అభ్యర్థించిన పక్షంలో తాము దీన్ని పరిశీలిస్తామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమీ హంట్ తెలిపారు. తమ గూఢచర్య డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయడంతో ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ [పై పూర్తి స్థాయిలో సైబర్ దాడులను ప్రారంభించింది. టెహరాన్ లోని మిసైల్, రాకెట్ సిస్టంలను కన్రోల్ చేయడానికి […]

ఇరాన్ పై అమెరికా పోరుకు బ్రిటన్ బాసట
Follow us on

ఇరాన్ పై జరిపే సైనిక దాడికి సహకరించాలని అమెరికా కోరితే అందుకు తాము రెడీగా ఉన్నామని బ్రిటన్ ప్రకటించింది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు అభ్యర్థించిన పక్షంలో తాము దీన్ని పరిశీలిస్తామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమీ హంట్ తెలిపారు. తమ గూఢచర్య డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయడంతో ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ [పై పూర్తి స్థాయిలో సైబర్ దాడులను ప్రారంభించింది. టెహరాన్ లోని మిసైల్, రాకెట్ సిస్టంలను కన్రోల్ చేయడానికి వినియోగించే కంప్యూటర్ సిస్టం పై పెంటగాన్ అప్పుడే సైబర్ దాడికి సంసిధ్ధమైంది. నిజానికి ఇరాన్ మీద సైనిక దాడికి ట్రంప్ సిధ్ధపడినా చివరి క్షణంలో ఆ యోచనను విరమించుకున్నారు. కాగా-ఈ సమయంలో తాము అమెరికాకు మద్దతుగా నిలుస్తామని, అది తమ మిత్ర దేశమని హంట్ పేర్కొన్నారు. మిలిటరీ సపోర్ట్ కావాలని అమెరికా కోరితే దాన్ని పరిశీలిస్తామన్నారు. మధ్య ప్రాచ్యంలో శాంతిని, సుస్థిరతను దెబ్బ తీసేందుకు ఇరాన్ యత్నిస్తోందని, ఇటీవల అమెరికా దేశ పరిధిలోని ఫుజైరహ్ రేవు వద్ద ఆ దేశ సైనికులు నాలుగు టాంకర్లను పేల్చివేయడం ఇందులో భాగమేనని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. తమ సైబర్ దాడులతో ఇరాన్ లోని మిసైల్ లాంచర్లు, రాకెట్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయని అమెరికా చేసిన ప్రకటనను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. అయితే ఇరానియన్ సిస్టం లు పాడయ్యాయా అన్న విషయం స్పష్టం కాలేదు. అమెరికా చేసిన సైబర్ దాడులు ఫెయిలయ్యాయని ఇరాన్ మంత్రి ఒకరు తెలిపారు. గత ఏడాది మేం 33 మిలియన్ ఎటాక్ లను ఎదుర్కొన్నాం అని ఇరాన్ సమాచార శాఖా మంత్రి మహమ్మద్ జావేద్ అజారీ తెలిపారు. 2015 నాటి అణు ఒప్పందం నుంచి అమెరికా గత ఏడాది వైదొలగినప్పటినుంచి ఈ దేశానికి, ఇరాన్ కు మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది.