బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

| Edited By:

Oct 20, 2019 | 9:50 AM

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యునైటెడ్ కింగ్‌డం (యూకే) వ్యవహారానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. వేరుపడే ప్రక్రియను ఆలస్యం చేయాలంటూ బ్రిటన్‌ పార్లమెంటు తీర్మానించింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని తక్షణం అంగీకరించేందుకు కామన్స్‌ సభ రిజెక్ట్ చేసింది. ఈ నెల చివరిలోగా ఈ వ్యవహారం తేలాల్సి ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని, దాని పర్యవసానాలను అధ్యయనం చేయడానికి.. తమకు మరో 3 నెలల గడువు కావాలని ఎంపీలు తేల్చిచెప్పారు. వెంటనే ఆమోదించాలన్న బోరిస్‌ జోన్సన్‌ […]

బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఎదురుదెబ్బ
Follow us on

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యునైటెడ్ కింగ్‌డం (యూకే) వ్యవహారానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. వేరుపడే ప్రక్రియను ఆలస్యం చేయాలంటూ బ్రిటన్‌ పార్లమెంటు తీర్మానించింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని తక్షణం అంగీకరించేందుకు కామన్స్‌ సభ రిజెక్ట్ చేసింది. ఈ నెల చివరిలోగా ఈ వ్యవహారం తేలాల్సి ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని, దాని పర్యవసానాలను అధ్యయనం చేయడానికి.. తమకు మరో 3 నెలల గడువు కావాలని ఎంపీలు తేల్చిచెప్పారు. వెంటనే ఆమోదించాలన్న బోరిస్‌ జోన్సన్‌ ప్రతిపాదనను కామన్స్‌ సభ 322-306 ఓట్ల తేడాతో ఓడించింది. ఇది బోరిస్ జాన్సన్‌కు సభలో ఎదురైన తొలి ఎదురుదెబ్బ. కాగా, జాన్సన్ మాత్రం ఈ విషయంపై మరోసారి ఎంపీల అభిప్రాయాన్ని కోరుతానని, డెడ్‌లైన్‌లోగా ఒప్పందాన్ని ఆమోదించేట్లు చేస్తానని స్పష్టం చేశారు.