ఇరాక్ పడవ బోల్తా ఘటనలో 92కి చేరిన మృతుల సంఖ్య

| Edited By:

Mar 22, 2019 | 12:06 PM

ఇరాక్‌లో టైగ్రీన్ నదిలో పడవ బోల్తా ఘటనలో మ‌ృతుల సంఖ్య 92కి చేరింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మొహూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నది పడవబోల్తా పడిన సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇరాకిల పర్వదినం నౌరోజ్‌ను జరుపుకోవడానికి వీళ్లంతా పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉమ్ అల్ రబీన్ ద్వీపంలో సంబరాల కోసం వెళ్తుండగా […]

ఇరాక్ పడవ బోల్తా ఘటనలో 92కి చేరిన మృతుల సంఖ్య
Follow us on

ఇరాక్‌లో టైగ్రీన్ నదిలో పడవ బోల్తా ఘటనలో మ‌ృతుల సంఖ్య 92కి చేరింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మొహూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నది పడవబోల్తా పడిన సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇరాకిల పర్వదినం నౌరోజ్‌ను జరుపుకోవడానికి వీళ్లంతా పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉమ్ అల్ రబీన్ ద్వీపంలో సంబరాల కోసం వెళ్తుండగా పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది.

పడవ బోల్తా పడ్డ తరువాత చాలామంది నదీప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పడవలో రెట్టింపు స్థాయి జనం ఎక్కడంతో అదుపు తప్పి బోల్తా పడినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. టూరిస్టుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నపిల్లలు కావడం.. వారికి రాకపోవడంతో మ‌ృతుల సంఖ్య పెరిగింది.