Covaxin: అమెరికా మార్కెట్లో హైదరాబాద్‌ వ్యాక్సిన్‌… ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటిక్‌…

|

Feb 03, 2021 | 5:48 AM

Bharat Biotech Deal For USA: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో రూపొందించిన వ్యాక్సిన్లలో హైదరాబాద్‌కు చెందిన కొవాగ్జిన్‌ ఒకటి. భారత్‌ బయోటిక్‌ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికే...

Covaxin: అమెరికా మార్కెట్లో హైదరాబాద్‌ వ్యాక్సిన్‌... ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటిక్‌...
Follow us on

Bharat Biotech Deal For USA: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో రూపొందించిన వ్యాక్సిన్లలో హైదరాబాద్‌కు చెందిన కొవాగ్జిన్‌ ఒకటి. భారత్‌ బయోటిక్‌ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ వ్యాక్సిన్‌ అమెరికాకు కూడా ఎగుమతి కానుంది. కొవాగ్జిన్‌ను అమెరికాలో విక్రయించడానికి అక్కడి ప్రముఖ బయో ఫార్మా స్యూటికల్‌ కంపెనీ ఓక్యుజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు కంపెనీలు పంచుకోనున్నాయి. ఇక ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కొవాగ్జిన్‌ అమెరికా హక్కులు ఓక్యుజెన్‌కు లభిస్తాయి. అమెరికాలో క్లినికల్‌ పరీక్షలు, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవడం, విక్రయం వంటి అంశాలను ఓక్యుజెన్‌ చూసుకుంటుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తొలిదశలో కొవాగ్జిన్‌ టీకా డోసులను భారత్‌ బయోటెక్‌ సరఫరా చేస్తుంది. ఆ తర్వాత టీకాను అమెరికాలో తయారు చేయడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్యుజెన్‌కు అందిస్తుంది. అమెరికాలో కొవాగ్జిన్‌ అమ్మకాలపై వచ్చిన లాభాల్లో 45 శాతం వాటా ఆక్యుజెన్‌ది కాగా మిగిలిన సొమ్ము భారత్‌ బయోటెక్‌కు లభిస్తుంది.

Also Read: కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?