లెబనాన్‌కు మరోసారి భారత్ సాయం

|

Aug 11, 2020 | 4:47 PM

లెబనాన్ దేశానికి గతంలో కొవిడ్ బారినపడ్డ లెబనాన్ ను భారత అండగా నిలిచింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. తాజాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు భారతదేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు ప్రకటించింది.

లెబనాన్‌కు మరోసారి భారత్ సాయం
Follow us on

బాంబుల విస్పోటనంతో దద్దరిల్లిన లెబనాన్‌కు భారత్‌ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృత్యువాతపడ్డారు. వందలాది భవనాలు నామరూపాలు లేకుండా కూలిపోయాయి. బీరుట్ తీరం శిధిలాల దిబ్బగా మారి అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కొవిడ్ బారినపడ్డ లెబనాన్ ను భారత అండగా నిలిచింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. తాజాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు భారతదేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ త్రిపాఠి వెల్లడించారు. భారత ప్రభుత్వం తరఫున లెబనాన్‌ ప్రజలకు, ప్రభుత్వానికి సానుభూతి వ్యక్తం చేసిన త్రిపాఠి.. వారికి తోడ్పాటునందించేందుకు భారత్‌ నుంచి మానవ వనరులను పంపించనున్నట్లు పేర్కొన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు భారత ప్రభుత్వం లెబనాన్‌ ప్రభుత్వంతో మంతనాలు సాగిస్తోందని వెల్లడించారు.

ఈ నెల ఆగస్టు 4వ తేదీన బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. 2,750 మెట్రిక్‌ టన్నుల నైట్రేట్‌ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లెబనాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దుర్ఘటనలో 158 మంది ప్రాణాలను కోల్పోయారు. 6 వేల మందికి పైగా గాయపడి క్షతగాత్రులయ్యారు. ఈ భారీ పేలుళ్ల ధాటికి నగరంలోని సగానికిపైగా భవనాలు దెబ్బతిని నేలకొరిగాయి. దీంతో బీరుట్ నగరంలో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది.