బాగ్దాదీ.. ఒసామా బిన్ లాడెన్ ల ‘ కిల్లింగ్స్ ‘.. నేటికీ..నాటికీ ఎంత తేడా ?

రెండు హై రిస్క్ దాడులు.. ఇద్దరు కరడు గట్టిన నేరస్తుల వధ.. వైట్ హౌస్ లో రెండు నాటకీయ పరిణామాలు.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ అబూ బకర్ అల్ -బాగ్దాదీ శనివారం సిరియాలో అమెరికా దళాల దాడిలో మరణించాడు. (అయితే అతగాడు తనను తాను పేల్చేసుకుని సూసైడ్ చేసుకున్నాడని కూడా అంటున్నారు). అతడిని మట్టుబెడుతున్న వైనాన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోని సిచువేషన్ రూమ్ లో కూర్చుని లైవ్ గా చూశాడు. కాగా-ఎనిమిదేళ్ల క్రితం అప్పటి […]

బాగ్దాదీ.. ఒసామా బిన్ లాడెన్ ల ' కిల్లింగ్స్ '.. నేటికీ..నాటికీ ఎంత తేడా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:13 PM

రెండు హై రిస్క్ దాడులు.. ఇద్దరు కరడు గట్టిన నేరస్తుల వధ.. వైట్ హౌస్ లో రెండు నాటకీయ పరిణామాలు.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ అబూ బకర్ అల్ -బాగ్దాదీ శనివారం సిరియాలో అమెరికా దళాల దాడిలో మరణించాడు. (అయితే అతగాడు తనను తాను పేల్చేసుకుని సూసైడ్ చేసుకున్నాడని కూడా అంటున్నారు). అతడిని మట్టుబెడుతున్న వైనాన్ని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోని సిచువేషన్ రూమ్ లో కూర్చుని లైవ్ గా చూశాడు. కాగా-ఎనిమిదేళ్ల క్రితం అప్పటి యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. నాటి అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ హతం కావడాన్నిచూసిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆయనకూ, నేటి అధ్యక్షునికీ ఎంత తేడా ? సిరియాలో బాగ్దాదీపై శనివారం రాత్రి జరిగిన ‘ ఆపరేషన్ ‘ ను ట్రంప్ తన అయిదుగురు సీనియర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లతో కలిసి వీక్షించాడు. వైట్ హౌస్ ఈ ఫోటోను ఆదివారం రిలీజ్ చేసింది. ఇందులో వీరంతా డార్క్ సూట్లతో కెమెరాను చూస్తూ పోజిచ్చారు. ట్రంప్ తల పైభాగంలో గోడమీద ‘ ప్రెసిడెన్షియల్ సీల్ ‘ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2011 మే నెలలో లాడెన్ ను అమెరికన్ నేవీ దళాలు అంతమొందిస్తున్నప్పటి దృశ్యాలను అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఎలా చూస్తున్నారో అందుకు సంబంధించిన ఫోటో కూడా తాజాగా బయటపడింది. ఈ ఫొటోలో ఒబామా ఆ గదిలో ఎక్కడో దాదాపు మూలన ఓ ఫోల్డింగ్ చైర్ లో కూర్చుంటే.. నాటి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, నాటి రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ ఆమె పక్కనే చేతులు ముడుచుకుని ఆసీనులయ్యారు. ఒబామా తలపై గోడ మీద ప్రెసిడెన్షియల్ సీల్ ఏదీ లేదు. పైగా ఆ గది అంతా సుమారు 13 మందితో కిక్కిరిసి పోయింది. బాగ్దాదీ మృతి అనంతరం ట్రంప్.. బిన్ లాడెన్ మృతితో ఈ ఘటనను పోలుస్తూ.. ‘ దానికన్నా ఇది అతి పెద్ద సంఘటన ‘ అని కేక పెట్టినంత పని చేశాడు.

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.