Egypt: విమానాన్ని కుప్పకూల్చిన సిగరెట్.. ప్రమాద దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

|

Apr 28, 2022 | 6:53 AM

2016 లో ఈజిప్ట్ దేశానికి చెందిన ఈజిప్టు(Egypt) ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 66 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాద ఘటపై దర్యాప్తు చేపట్టిన...

Egypt: విమానాన్ని కుప్పకూల్చిన సిగరెట్.. ప్రమాద దర్యాప్తులో విస్తుపోయే విషయాలు
Egypt
Follow us on

2016 లో ఈజిప్ట్ దేశానికి చెందిన ఈజిప్టు(Egypt) ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 66 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాద ఘటపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. పైలట్‌ సిగరెట్‌ అంటించడం వల్ల కాక్‌పిట్‌(Cockpit)లో మంటలు చెలరేగి విమానం సంద్రంలో కుప్పకూలినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదంపై 134 పేజీల నివేదికను ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు పారిస్‌లోని అప్పీల్‌ కోర్టులో అందించారు. కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ సిగరెట్‌ వెలిగించగానే అత్యవసర మాస్క్‌ నుంచి ఆక్సిజన్‌ లీక్‌ అయ్యింది. దీంతో కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి విమానం(Plane Crash) కూలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. ఘటన సమయంలో కాక్‌పిట్ సిబ్బంది అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డ్‌ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వివరాలను న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది.

ఈజిప్టు ఎయిర్‌ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ-320 2016 మే నెలలో విమానం ప్రమాదానికి గురైంది. పారిస్‌ నుంచి కైరోకు బయల్దేరిన ఈ విమానం రాడార్‌ నుంచి అదృశ్యమైంది. కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలోని తూర్పు మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది సహా 66 మంది ప్రయాణీకులున్నారు. ఘటన అనంతరం భారీ గాలింపు చేపట్టగా సముద్ర గర్భంలో విమానం బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. ఈ బ్లాక్‌ బాక్స్‌ ఆధారంగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీన్ని ఉగ్రదాడిగా ఈజిప్టు అధికారులు భావించినప్పటికీ.. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రముఠా ప్రకటనలు చేయలేదు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్.. పవర్ ఫుల్‏గా ఉందంటూ మెగాస్టార్ కితాబు..

Fuel Price Issue: ఆ 26 లక్షల కోట్ల ఆదాయం ఏటు పోయింది?.. మోదీపై విరుచుకుపడిన విపక్షాలు..!