US Sandstorm: అమెరికాలో ఇసుక తుపాను బీభత్సం.. 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. 8 మంది మృతి

| Edited By: Janardhan Veluru

Jul 27, 2021 | 1:47 PM

అమెరికాలోని ఉటా సిటీలో ఇసుక తుపాను కారణంగా ఇంటర్ స్టేట్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించగా 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ నెల 25 న సుమారు 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

US Sandstorm: అమెరికాలో ఇసుక తుపాను బీభత్సం.. 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. 8 మంది మృతి
At Least 8 Killed Several Injured After Utah Sandstorm Striggers Car Crashes
Follow us on

అమెరికాలోని ఉటా సిటీలో ఇసుక తుపాను కారణంగా ఇంటర్ స్టేట్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించగా 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ నెల 25 న సుమారు 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ హైవేపై మేడో-కనోష్ ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఒక్కసారిగా ఈ వాహనాలు ఢీ కొన్నట్టు అధికారులు తెలిపారు. భారీ పెనుగాలులు, ఇసుక తుపాను కారణంగా వాహనదారులకు దారి సరిగా కనిపించకపోవడంతో ప్రమాద తీవ్రత హెచ్చింది. నిన్న 10 మంది క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో పిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. క్షత గాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. ట్రాక్టర్ ట్రైలర్లు, ట్రక్కులు, కార్లు ఒకదాని[పై ఒకటి ఎక్కిన బీభత్సం తాలూకు వీడియోలను వారు విడుదల చేశారు.

ఒకే వాహజనంలోని అయిదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వీకెండ్ తరువాత ఉటా హిస్టరీ హాలిడే సందర్బంగా వాహనదారుల్లో చాలామంది ఈ హైవేపై వెళ్తున్నారని, ఇది అత్యంత ఘోరమైన యాక్సిడెంట్ అని స్టేట్ మీడియా వెల్లడించింది. సాధారణంగా ఉటా తదితర నగరాలను ఇసుక తుపానులు ముంచెత్తుతుంటాయి. పెను గాలులతో ఈ నగరాలు వణికిపోతుంటాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలు చేసి ప్రజలను అలర్ట్ చేస్తున్నప్పటికీ.. ఈ విధమైన అనుకోని ఉత్పాతాలు అమాయక ప్రజలకుప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మరణించినవారిని అధికారులు గుర్తించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువులు ఎం చేసిందో చుడండి..వైరల్ వీడియో:Viral Video.

 రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

 ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.

 భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.