సూడాన్‌‌లో ఘోరం.. 18మంది భారతీయులు మృతి

| Edited By: Pardhasaradhi Peri

Dec 04, 2019 | 8:34 PM

సూడాన్‌లో ఘోరం జరిగింది. రాజధాని ఖర్తూమ్‌లో ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 130మందికి పైగా గాయపడ్డారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొంతమంది చనిపోయిన ఉండవొచ్చని వారు వెల్లడించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించలేకపోతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో 34 మంది […]

సూడాన్‌‌లో ఘోరం.. 18మంది భారతీయులు మృతి
Follow us on

సూడాన్‌లో ఘోరం జరిగింది. రాజధాని ఖర్తూమ్‌లో ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 130మందికి పైగా గాయపడ్డారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొంతమంది చనిపోయిన ఉండవొచ్చని వారు వెల్లడించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించలేకపోతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు.

ఇక ఈ ఘటనలో 34 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా.. మరో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఎంబసీ అధికారులు వెళ్లి సమీక్షిస్తున్నారు. వివరాల కోసం 24 గంటల ఎమర్జెన్సీ హాట్‌లైన్ ఏర్పాటు చేశాము అని సోషల్ మీడియాలో వెల్లడించారు.