ప్లాస్టిక్ తిని మృత్యువాత పడ్డ ప్రెగ్నెంట్ తిమింగలం

| Edited By:

Apr 03, 2019 | 9:54 PM

ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల వాయు కాలుష్యాలకు కారణమవుతుండటతో జంతువుల ప్రాణాలు సైతం హరించివేస్తోంది. తాజాగా ఓ భారీ తిమింగలం ప్లాస్టిక్ తిని చనిపోయింది. అది గర్భవతి కూడా కావడంతో దాని కడుపులో మృతిచెందిన పిండంతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిస్టులు గుర్తించారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటలీ తీర ప్రాంతానికి అతిపెద్ద తిమింగలం కొట్టుకొచ్చింది. అది చనిపోవడంతో తిమింగలాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించిన సైంటిస్టులు షాక్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయిన ఈ […]

ప్లాస్టిక్ తిని మృత్యువాత పడ్డ ప్రెగ్నెంట్ తిమింగలం
Follow us on

ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల వాయు కాలుష్యాలకు కారణమవుతుండటతో జంతువుల ప్రాణాలు సైతం హరించివేస్తోంది. తాజాగా ఓ భారీ తిమింగలం ప్లాస్టిక్ తిని చనిపోయింది. అది గర్భవతి కూడా కావడంతో దాని కడుపులో మృతిచెందిన పిండంతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిస్టులు గుర్తించారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటలీ తీర ప్రాంతానికి అతిపెద్ద తిమింగలం కొట్టుకొచ్చింది. అది చనిపోవడంతో తిమింగలాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించిన సైంటిస్టులు షాక్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయిన ఈ భారీ తిమింగలం కడుపులో 22 కిలోల ప్లాస్టిక్‌ను గుర్తించారు.

ఈ ఘటనపై అక్కడ పర్యావరణ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సముద్రంలో భారీ ఎత్తున ప్లాస్టిక్ వ్యార్థలైన బాటిళ్లు, వలలు, కవర్లు తినేసరికి సముద్ర జీవులు చనిపోతున్నాయని అన్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆడ తిమింగలం కడుపులో పిండం కూడా ప్రారంభదశలో ఉందన్నారు. ప్లాస్టిక్ తినడం వల్ల డాల్ఫిన్ల జీర్ణ వ్యవస్థ పాడైపోయి అవి చనిపోతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు తినే చేపల్ని మనుషులు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యనిపుణులు.

కడుపులో ప్లాస్టిక్ పేరుకుపోయిన కారణంగానే అది ఏమీ తినలేని పరిస్థితికి చేరిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే అనారోగ్యంపాలై మృతి చెందని తెలిపారు. నదులు..సముద్రాలు ప్లాస్టిక్ వల్ల కాలుష్యం కారకాలుగా మారుతున్నాయనటానికి ఈ తిమింగలం మృతే ఉదాహరణ అని పర్యావరణ వేత్తలు అంటున్నారు. గత పదేళ్లలో చనిపోయిన 61 డాల్ఫిన్లు, తిమింగలాలకు పోస్టుమార్టం నిర్వహించగా వాటి మృతికి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని వైద్య అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇలా ప్లాస్టిక్ తిని ఇలా తిమింగళాలు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా కాలుష్యంపైనా..ప్లాస్టిక్ నిషేధంపైనా కఠిన చర్యలు తీసుకోవాలనీ..లేకుంటే మరిన్ని మూగజీవాలు బలైపోయే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.