America: వ్యాక్సిన్ వేయించుకుంటే చాలు ఎక్కడన్నా తిరగొచ్చు.. ప్రయాణ నిబంధనలు సడలించిన అమెరికా 

|

Apr 06, 2021 | 11:06 AM

కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ నిబంధనల్లో క్రమేపీ మార్పులు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

America: వ్యాక్సిన్ వేయించుకుంటే చాలు ఎక్కడన్నా తిరగొచ్చు.. ప్రయాణ నిబంధనలు సడలించిన అమెరికా 
America
Follow us on

America: కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ నిబంధనల్లో క్రమేపీ మార్పులు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తమ దేశంలో ప్రయాణాలపై ఆంక్షలను సవరిస్తూ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు కోవిడ్ బారిన పడటం అతి తక్కువగా జరుగుతోంది. అందువల్ల పూర్తిగా వ్యాక్సిన్ (రెండు డోసులు) వేసుకున్న వారు తమ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సీడీసీ ప్రకటించింది.

కొత్తగా ఇచ్చిన సవరణ నిబంధనల ప్రకారం అమెరికాలోని ప్రజలు ఇకపై తమ ప్రయాణాలకు ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకొనవసరం లేదు. అదేవిధంగా తమ గమ్యస్థానం చేరిన తరువాత సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండనవసరం లేదు. అయితే, మాస్క్ ధరించడం.. సామాజిక దూరం పాటించడం.. గుంపులుగా చేరకపోవడం.. తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం వంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి.

”అమెరికాలో మిలియన్ మంది ప్రజలు ప్రతిరోజూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు టీకా వేయించుకున్న వారు సురక్షితంగా ఉన్నారని తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ప్రయాణాలపై నిబంధనలు సరళతరం చేశాం.” అని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ తెలిపారు.

”మేము ప్రతి ఒక్క అమెరికన్ తొందరగా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తాము. అందువల్ల తిరిగి సురక్షితమైన పూర్వ స్థితిలోకి రావడానికి వీలవుతుంది. టీకాలు అందుకు సహకరిస్తాయి.” అని అయన వివరించారు. 

ఇక అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందని సీడీసీ చెప్పింది. అవి ఏమిటంటే..

  • పూర్తిస్థాయిలో కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అంతర్జాతీయంగా ఎక్కడికైనా కోవిడ్ పరీక్షల అవసరం లేకుండా వెళ్ళవచ్చు. అయితే, వారు వెళుతున్న దేశంలో కోవిడ్ పరీక్ష నిబంధన ఉంటె మాత్రం పరీక్ష చేయించుకోవాలి.
  • పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్న వ్యక్తులు ఇతర దేశాల నుంచి వచ్చిన తరువాత క్వారంటైన్ లో ఊడవలసిన అవసరం లేదు.
  • ఇతర దేశాలనుంచి అమెరికా వచ్చేవారు వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇవ్వలేకపోతే 3 రోజుల నుంచి 5 రోజుల లోపు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
  • పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు  కోవిడ్-19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.

Also Read: అమెరికా క్యాపిటల్‌ భవనం తాత్కాలికంగా మూసివేత.. 6 వరకు వైట్‌హౌస్‌లో జాతీయ జెండాను అవనతం చేయాలని బైడెన్‌ ఆదేశం

Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!