ఆకాశమే సముద్రమయితే ఇలా ఉంటుందా ?

|

Jun 21, 2019 | 4:16 PM

‘ ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందా ..?’ అన్నాడో సినీ కవి ! అమ్మాయి అయినా, కాకున్నా .. నీలి మబ్బుల నింగిని చూస్తే అందరికీ అలానే కనిపించవచ్చు. కానీ నింగిని ఆ రకంగా కాకుండా ‘ సముద్రం ‘ లా చూస్తే ఎలా ఉంటుంది ? కారు మబ్బులతో కూడిన ఆకాశంలో అవి మెల్లగా కదులుతుంటే.. ఒకదానికొకటి కలిసిపోతూ సాగుతుంటే.. సముద్రపు అలలు గుర్తుకు రాక మానవు. తుఫాను ముందటి ‘ ప్రశాంత ‘ దృశ్యం […]

ఆకాశమే సముద్రమయితే ఇలా ఉంటుందా ?
Follow us on

‘ ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుందా ..?’ అన్నాడో సినీ కవి ! అమ్మాయి అయినా, కాకున్నా .. నీలి మబ్బుల నింగిని చూస్తే అందరికీ అలానే కనిపించవచ్చు. కానీ నింగిని ఆ రకంగా కాకుండా ‘ సముద్రం ‘ లా చూస్తే ఎలా ఉంటుంది ? కారు మబ్బులతో కూడిన ఆకాశంలో అవి మెల్లగా కదులుతుంటే.. ఒకదానికొకటి కలిసిపోతూ సాగుతుంటే.. సముద్రపు అలలు గుర్తుకు రాక మానవు. తుఫాను ముందటి
‘ ప్రశాంత ‘ దృశ్యం కళ్ళముందు ఆవిష్కరిస్తుంది. ఆస్ట్రేలియా లోని మైర్టిల్ ఫోర్డ్ లో ఈ నెల 11 న హాయిగా కారులో ప్రయాణిస్తూ ఆకాశం వైపు చూసిన పాల్ మెక్ కల్లీ అనే వ్యక్తి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కారణం.. వింతగా కదులుతున్న మేఘాలు త్వరత్వరగా షేపులు మారుతూ.. సముద్రపు అలలను గుర్తుకు తెచ్చాయతనికి. వెంటనే కారు ఆపి.. తన మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా వచ్చినప్పుడు, తుఫాను వాతావరణంలోనూ నింగిలో ఇలాంటి దృశ్యాలు చోటు చేసుకుంటాయట. ఈ వైనాన్నే ‘ అండ్యులాటస్ ఆస్పెరిటాస్ ‘ అంటారని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఏమైనా చివరిసారి ఈ విధమైన దృశ్యం 2017 లో కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘ ఆకాశ వింత ‘ పై చర్చ జరిగింది. ప్రకృతి ప్రేమికులు దీన్ని ఎంతగానో ఆస్వాదించితే.. శాస్త్రజ్ఞులు దీనిపై మరిన్ని పరిశోధనలకు నడుం కట్టారు.