Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. ఏకంగా మూడు బ్యాంకులు లేపేసి ఎలా పారిపోయారో చూస్తే అదిరిపోతారంతే!

|

Aug 31, 2021 | 8:00 PM

బ్యాంకు దొంగతనాలను సినిమాల్లో చూసి ఓహో అనుకుంటాం. నిజంగా చూస్తే ఉంటుంది మజా. దొంగతనం కంటే.. తరువాత జరిగే చేజింగ్ అదిరిపోతుంది అంతే.. కాదంటారా.. అయితే, అర్జంట్ గా ఈ వీడియోలు చూసేయండి..

Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. ఏకంగా మూడు బ్యాంకులు లేపేసి ఎలా పారిపోయారో చూస్తే అదిరిపోతారంతే!
Massive Robbery
Follow us on

Massive Robbery: బ్యాంకు దొంగతనాలను సినిమాల్లో చూసి ఓహో అనుకుంటాం. భారీ బ్యాంకు దొంగతనానికి ఓ నాయకుడు తన పాతిక మంది అనుచరులతో ప్లాన్ వేస్తాడు. తరువాత అందరూ ఆయుధాలతో బ్యాంకుకు చేరుకుంటారు. అదీ అర్ధరాత్రి. బ్యాంకులో దొంగతనం చేస్తారు. తరువాత అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అక్కడ హీరో గానీ, పోలీసులు గానీ వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. అంతే.. ఇంకేముంది.. దొంగలు అక్కడ దగ్గరలో దొరికిన సాధారణ పౌరుల్ని పట్టుకుని వారిని తమ కారులో ఎక్కించుకుని వారిని చంపేస్తామని బెదిరించి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. హీరో వెనుక కొంత దూరం వెంబడించినా వారు దొరకరు. ఇదే సీక్వెన్స్ అన్ని భాషల సినిమాల్లోనూ కొన్ని వేల సార్లు.. కొద్దిగా అటూ ఇటూగా చూపిస్తూ వస్తున్నారు. మరి అలాంటి సినిమాలు.. సీన్లు తెగ చూసేసరేమో కొందరు దొంగలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకులు కొల్లగోట్టేసి పారిపోయారు. వారు పారిపోతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలిదంతా ఎక్కడ ఎలా జరిగిందంటే..

రియల్ లైఫ్ లో ఈ సీన్ బ్రెజిల్ లో జరిగింది. భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడిన దొంగలు అక్కడి సాధారణ పౌరులను బందీలుగా పట్టుకుని.. తమ కవచాలుగా చేసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు మరణించారు. బ్రెజిల్ లోని సావో పాలో నుంచి 290 మైళ్ళ దూరంలో ఉన్న అరకాతుబా నగర కేంద్రంలోని మూడు బ్యాంకులపై దొంగలు దాడి చేశారు. ఈ దొంగల గ్యాంగ్‌లో 20 మంది ఉన్నారు. వీరంతా మెషిన్ గన్స్, బాంబులు, డ్రోన్లను తీసుకుని ఈ భారీ దొంగతనాలకు పాల్పడ్డారు. మూడు బ్యాంకుల పైనా దాడి చేసి దోచేశారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. పోలీసులు తమను వెంబడించకుండా రోడ్లకు అడ్డుగా కార్లను పెట్టి నిప్పు పెట్టేశారు. ఇక ఇతరులు ఎవరూ తమను ఆపకుండా స్థానిక పౌరులను బందీలుగా చేసుకుని తమ కార్లపై కట్టేసి తీసుకుపోయారు.

ఈ మొత్తం సీన్లన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటెజిలను యూరి మాక్రి అనే టీవీ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ మీరూ ఇక్కడ చూడొచ్చు..

 

అదేవిధంగా ఇంకో యూజర్ వేరే ప్రాంతం నుంచి దొంగలు పారిపోతున్న దృశ్యాలను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ఇక్కడ చూడొచ్చు.

చూశారుగా.. ఎంత దారుణంగా ఆ దొంగలు పారిపోయారో. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు కూడా అమ్మో అనుకుంటున్నారు. ఈ ట్వీట్ల పై విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ట్వీట్ లను షేర్ చేస్తున్నారు.

Also Read: Taliban – India talks: భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌ అడ్డాగా మార్చొద్దు.. తాలిబన్లకు భారత్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

International Steals Fest: కరోనా నిబంధనలతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న కొన్ని దేశాలు.. బెస్ట్ ఛాయిస్‌గా ఈ ఐదు దేశాలు..