Russia – Ukraine War: ఉక్రెయిన్‌పై వార్‌లో వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్న రష్యా.. పట్టుబడిన ఆ సైనికులందరినీ..

|

Jun 09, 2022 | 5:50 AM

Russia - Ukraine War: ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రష్యా. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ నగరాలపై

Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై వార్‌లో వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్న రష్యా.. పట్టుబడిన ఆ సైనికులందరినీ..
Ukraine
Follow us on

Russia – Ukraine War: ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రష్యా. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ నగరాలపై రష్యన్‌ సైన్యం దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి. డాన్‌బాస్‌ రీజియన్‌లోని సెవరోడోనెస్క్‌ మీద వరుసగా షెల్లింగ్‌స కురిపిస్తోంది. క్షిపణుల దాడుల్లో ఆ నగరం చాలా వరకూ ధ్వంసమైంది. మరోవైపు మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ప్లాంట్‌ దగ్గర లొంగిపోయిన వెయ్యికి మంది ఉక్రెయిన్‌ సైనికులను రష్యా తమ దేశానికి తరలించినట్లు తెలుస్తోంది. రష్యన్‌ సైనికులను ఉక్రెయిన్‌ యుద్ధనేరాల కింద విచారణ చేపట్టినట్లుగానే తామూ అదే విధంగా వ్యవహరిస్తామని పరోక్షంగా సందేశం పంపింది. ఉక్రెయిన్‌ సైన్యం తరపున పోరాడుతున్న ఇద్దరు బ్రిటన్‌ సైనికులను రష్యా బంధించింది. వీరిని కిరాయి సైనికులుగా చెబుతూ- డాన్‌బాస్‌ ప్రాంతంలోని కోర్టులో విచారిస్తోంది. వీరినిఈ కేసులో దోషులుగా ప్రకటిస్తే ఈ ముగ్గురు సైనికులకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.

ఒకవైపు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుంటే పుతిన్‌లో ప్రత్యక్ష చర్చలను కోరుతున్నారు జెలెన్‌స్కీ.. చర్చల్లో ప్రతిష్ఠంభన సమస్యకు పరిష్కారం కాదని అన్నారు రష్యా యుద్ధనేరాల మీద పుస్తకం విడుదల చేస్తామని జెలెన్‌స్కీ చెప్పారు. మరోవైపు తుర్కియే-రష్యాల విదేశాంగ మంత్రులు ఇస్తాంబుల్‌లో సమావేశమ్యారు.. ఉక్రెయిన్‌ నుంచి ఆహారధాన్యాల ఎగుమతిని తాము అడ్డుకోవడం లేదని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవరోవ్‌ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌ తన జలమార్గాన్ని పేలుడు పదార్థాలు లేకుండా సురక్షితంగా ఉంచాలన్నారు లవరోవ్‌.