ఫ్రీగా వస్తుందని వెళ్లి… 62మంది బలి!

| Edited By:

Aug 10, 2019 | 6:39 PM

ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాంజానియా రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 62 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ నుంచి స్థానికులు పెట్రోల్‌ తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్నవారు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు. ఆయిల్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో […]

ఫ్రీగా వస్తుందని వెళ్లి... 62మంది బలి!
Follow us on

ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాంజానియా రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 62 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ నుంచి స్థానికులు పెట్రోల్‌ తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్నవారు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు.

ఆయిల్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు సమాచారం. టాంజానియా ఆర్థిక రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌లోని మొరోగోరో ప్రాంతంలో శనివారం ఓ చమురు ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో అందులోని ఆయిల్‌ రోడ్డుపై ప్రవహించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చమురు నింపుకొనేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా సజీవ దహనమయ్యారు.