తుఫాను ధాటికి నేపాల్ విలవిల‌

| Edited By:

Apr 01, 2019 | 12:29 PM

నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. తుఫాను ధాటికి 27 మంది మృతి చెందగా.. 400 మంది తీవ్రంగా గాయపడ్దారు. సహాయక చర్యలు చేపట్టిన రక్షణా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బారా, పార్సా జిల్లాల్లో పెనుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం […]

తుఫాను ధాటికి నేపాల్ విలవిల‌
Follow us on

నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. తుఫాను ధాటికి 27 మంది మృతి చెందగా.. 400 మంది తీవ్రంగా గాయపడ్దారు. సహాయక చర్యలు చేపట్టిన రక్షణా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బారా, పార్సా జిల్లాల్లో పెనుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని సలహాదారు బిష్ణు రిమాల్‌ మాట్లాడుతూ.. ‘ ఖాట్మండులోని మిడ్‌ ఎయిర్‌బేస్‌లో ఉన్న రెండు బెటాలియన్లను ఘటనా స్థలికి పంపించాం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మా బలగాలు బాధితులను రక్షిస్తాయి అని పేర్కొన్నారు.