ఇండోనేసియాలోని మకస్సిర్ సిటీలో ఓ చర్చిని టార్గెట్ చేసుకున్న ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చివేసుకున్నారు. ఈ ఘటనలో 14 మంది గాయపడినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈస్టర్ పవిత్ర వారం మొదలైన తోలి రోజే సూసైడ్ బాంబర్లు ఇలా కేథలిక్ చర్చి బయట చేరి తమను తాము పేల్చివేసుకున్నారు. సులవేసి ద్వీపం వద్ద గల ఈ చర్చిలోనికి బాంబర్లలో ఒకరు చొరబడేందుకు ప్రయత్నించాడని, అయితే సెక్యూరిటీ గార్డు అతడిని ఆపివేశాడని చర్చ్ ఫాదర్ తెలిపారు. దాంతో ఆ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకోవడంతో ఆ ప్రాంతమంతా మంటలు, పొగలతో భీతావహ వాతావరణం ఏర్పడింది. కొన్ని శరీర భాగాలు రోడ్డు మధ్యలో ఎగిరి పడ్డాయని, అవి ఈ బాంబర్లవేనా అన్నదిఇంకా నిర్ధారణ కావలసి ఉందని అధికారులు చెప్పారు. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించనప్పటికీ.. ఇస్లామిక్ స్టేట్ ప్రోత్సాహంతో జమాహ్ అన్షరుత్ దౌలా అనే గ్రూపే దీనికి కారణమని తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. లోగడ2018 లోసురబయ సిటీలోని పోలీసు పోస్ట్ పైన, చర్చీల పైనా ఈ విధమైన దాడులు జరిగాయని ఆ దాడుల్లో 30 మంది మృతి చెందగా అనేకమంది గాయపడ్డారని వారు చెప్పారు.
సులవేసి లోని మకస్సిర్ అతి పెద్ద నగరం. ఈ సిటీలో పెద్ద సంఖ్యలో ముస్లిములు, క్రైస్తవులు, ఇతర మతాల వారు నివసిస్తున్నారు . 2002 లో బాలి లోని టూరిస్ట్ ద్వీపంలో ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 202 మంది మరణించారు. వీరిలో చాలామంది విదేశీ టూరిస్టులే..
మరిన్ని చదవండి ఇక్కడ:జక్కన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు.. షాకైన చెర్రీ..ఫిదా అవుతున్న నెటిజెన్లు..: Rajamouli Gift For Ram Charan Birthday Video.
టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.