ఐఈడీ బ్లాస్ట్..19 మంది ఈసీ అధికారులు హతం

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2019 | 11:02 AM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి తాలిబన్‌లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. […]

ఐఈడీ బ్లాస్ట్..19 మంది ఈసీ అధికారులు హతం
Follow us on

ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి తాలిబన్‌లు రెచ్చిపోయారు. ఎన్నికల కమిషన్ అధికారులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కాంధహార్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ కార్యాలయానికి పేలుడు పదార్ధాలతో వాహనాల్లో వచ్చిన తాలిబన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చేశారు. ఈ ఘటనలో 19 మంది ఈసీ అధికారులు మరణించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు అధికారులు ఓటర్లు రిజిస్ట్రేషన్ పనుల్లో ఉండగా ఈ దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.