18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం

| Edited By: Anil kumar poka

Jul 05, 2019 | 7:37 AM

ఐఎస్ ఉగ్రవాద సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇరాక్ దేశంలో ఆ దేశ భద్రతా దళాలకు చెందిన జవాన్లు అమెరికా సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ స్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. అన్‌బర్, నిన్వేహ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిసి 18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇరాక్ మిలటరీ ప్రకటించింది. ఇక సిరియా దేశ సరిహద్దుల్లోని స్నేస్ […]

18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం
Follow us on

ఐఎస్ ఉగ్రవాద సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇరాక్ దేశంలో ఆ దేశ భద్రతా దళాలకు చెందిన జవాన్లు అమెరికా సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ స్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. అన్‌బర్, నిన్వేహ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిసి 18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇరాక్ మిలటరీ ప్రకటించింది.

ఇక సిరియా దేశ సరిహద్దుల్లోని స్నేస్ లాహ్ సరస్సు వద్ద మరియు సరిహద్దు అటవీ ప్రాంతంలో కూడా ఐఎస్ ఉగ్రవాదులున్నారనే సమాచారంతో.. అమెరికా సంకీర్ణ సేన వైమానిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాదుల వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.