ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం.. 157 మంది మృతి

| Edited By:

Mar 10, 2019 | 3:49 PM

ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి ఆ విమానం వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 157 మంది ఉన్నారు. వీరిలో 149 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 8 మంది క్రూ సభ్యులు ఉన్నారు. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి బయలుదేరిన […]

ఇథియోపియాలో  ఘోర విమాన ప్రమాదం.. 157 మంది మృతి
Follow us on

ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి ఆ విమానం వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 157 మంది ఉన్నారు. వీరిలో 149 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 8 మంది క్రూ సభ్యులు ఉన్నారు. ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు.

కూలిన విమాన ఆచూకీని కనుగొని, సహాయక చర్యలు అందించేందుకు గానూ సంబంధిత సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలపై అధికారులు ఎటువంటి వివరాలు తెలపలేదు. ప్రమాద స్థలికి ఇథియోపియా ఎయిర్‌లైన్‌ సిబ్బందిని పంపుతున్నాం. అత్యవసర సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్‌ అహ్మద్‌ స్పందించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని ఆయన కార్యాలయ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.