జడ్జికి షాకిచ్చిన వాట్సాప్… కేసును మధ్యలోనే వదిలేసి…!

| Edited By:

Aug 30, 2019 | 5:31 AM

కోర్టులో ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుండగా తనకొచ్చిన వాట్సాప్ మెసేజ్ చూసిన జడ్జి కేసు విచారణను అర్ధంతరంగా వదిలేసి వెళ్లిపోయారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిందీ ఘటన. ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ పార్టీ పంజాబ్ చీఫ్, న్యాయశాఖ మాజీ మంత్రి అయిన సనావుల్లా కారులో 15 కేజీల హెరాయిన్‌ పట్టుబడింది. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లాహోర్‌లోని నార్కోటిక్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది. బుధవారం కేసు విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి […]

జడ్జికి షాకిచ్చిన వాట్సాప్... కేసును మధ్యలోనే వదిలేసి...!
Follow us on
కోర్టులో ఓ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుండగా తనకొచ్చిన వాట్సాప్ మెసేజ్ చూసిన జడ్జి కేసు విచారణను అర్ధంతరంగా వదిలేసి వెళ్లిపోయారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిందీ ఘటన. ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ పార్టీ పంజాబ్ చీఫ్, న్యాయశాఖ మాజీ మంత్రి అయిన సనావుల్లా కారులో 15 కేజీల హెరాయిన్‌ పట్టుబడింది. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లాహోర్‌లోని నార్కోటిక్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది.
బుధవారం కేసు విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి మసూద్ అర్షద్‌కు వాట్సాప్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. ఇది చూసిన అర్షద్ వెంటనే కేసు విచారణను ఆపేసి తనకు లాహోర్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయిందని, ఇప్పుడే వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందని చెబుతూ కేసు విచారణను అర్ధంతరంగా వదిలిపెట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. న్యాయమూర్తి తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ న్యాయచరిత్రలో ఇదో బ్లాక్ డే అని సీనియర్ న్యాయవాది ఒకరు ఆరోపించారు. ఈ కేసులో తమకు ఇష్టమైన న్యాయమూర్తిని నియమించేందుకే ప్రభుత్వం అర్షద్‌ను అకస్మాత్తుగా బదిలీ చేసిందని మరో న్యాయవాది ఆరోపించారు.