Watch Video: కారు పార్క్ చేయొద్దన్న కంట్రోలర్.. ఆర్టీసీ ఉద్యోగిపై యువతీ,యువకుడు దాడి

| Edited By: Srikar T

Jun 12, 2024 | 2:02 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీసీ బస్టాండ్‎లో ఆన్ డ్యూటీలో ఉన్న కంట్రోలర్‎పై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. బస్టాండ్ స్థలంలో ప్రైవేట్ వాహనాలు పార్క్ చేయవద్దని.. కారును వెంటనే తీయాలని కోరిన కారణంగా ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్‎పై ఓ యువతి యువకుడు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. షాపింగ్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. బస్టాండ్‎లో కారును పార్క్ చేశారు. ఇది గమనించిన కంట్రోలర్ కారును అక్కడి నుండి తీయాలంటూ కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన కారు యజమానులు‌ కంట్రోలర్‎తో గొడవ కు దిగాడు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీసీ బస్టాండ్‎లో ఆన్ డ్యూటీలో ఉన్న కంట్రోలర్‎పై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. బస్టాండ్ స్థలంలో ప్రైవేట్ వాహనాలు పార్క్ చేయవద్దని.. కారును వెంటనే తీయాలని కోరిన కారణంగా ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్‎పై ఓ యువతి యువకుడు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. షాపింగ్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. బస్టాండ్‎లో కారును పార్క్ చేశారు. ఇది గమనించిన కంట్రోలర్ కారును అక్కడి నుండి తీయాలంటూ కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన కారు యజమానులు‌ కంట్రోలర్‎తో గొడవ కు దిగాడు. మాటమాటా పెరగడంతో వృద్దుడైన కంట్రోలర్‎పై విరుచుకు పడ్డారు. కారులో వచ్చిన ఆ యువతి యువకుల జంటను.. అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దాడికి దిగిన ఇద్దరిని వారించారు. అయినా యువతి, యువకుడు దాడి ఆపకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి కారణాలపై ఆరా తీశారు. ఆర్టీసీ బస్డాండ్ కంట్రోలర్, మంచిర్యాల ఆర్టీసీ డిపో డిఎం ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on