అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

Updated on: Jun 18, 2026 | 1:11 PM

కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కూలిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది విమాన సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనే భారీ వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది విమాన సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 2016 తర్వాత ఈ తరహా బాంబర్ విమానానికి జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. అధికారుల కథనం ప్రకారం, దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం అదుపుతప్పి రన్‌వేకు 300 గజాల దూరంలో తీవ్ర వేగంతో నేలను ఢీకొని ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.

Follow Us