No Extra Work: ఎక్స్‌ ట్రా వర్క్‌కి చెక్‌ పెట్టే కొత్త చట్టం.. ఎక్స్‌ట్రా వర్క్‌ చేయమని బలవంత పెట్టకూడదు.. (వీడియో)

Updated on: Nov 17, 2021 | 7:43 AM

కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. వర్క్‌ ఫ్రం హోమ్‌లో వర్కింగ్‌ అవర్స్‌ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒ‍త్తిడికి గురయ్యేవారు.


కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. వర్క్‌ ఫ్రం హోమ్‌లో వర్కింగ్‌ అవర్స్‌ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒ‍త్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేక పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమానా కట్టాలని బెదిరిస్తోంది పోర్చుగల్‌ ప్రభుత్వం.

కోవిడ్‌ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్స్‌, గ్రూప్ కాల్స్‌, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్స్‌ వంటివి ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్‌ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది.దీంతో బాస్‌లు, టీమ్‌ లీడర్‌లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్‌ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్‌ట్రా వర్క్‌ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్‌ ప్రభుత్వం కొత్త లేబర్‌ చట్టం తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us