ఇండో పాక్‌ సరిహద్దుల్లో వేలాడే ఖాళీ సీసాలు.. ఎందుకో ??

Updated on: Feb 13, 2026 | 1:30 PM

భారత సరిహద్దుల్లో ముళ్లకంచెపై వేలాడే గాజు సీసాలు BSFకు కీలకమైన తక్కువ ఖర్చుతో కూడుకున్న భద్రతా సాధనం. దట్టమైన పొగమంచులో కెమెరాలు విఫలమైనప్పుడు, ఈ సీసాలు 'కిణ కిణ' శబ్దంతో చొరబాటుదారులను హెచ్చరిస్తాయి. నిర్వహణ, విద్యుత్ అవసరం లేని ఈ పద్ధతి, మన జవాన్ల ప్రాణాలను రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది ఆధునిక సెన్సార్లకు ప్రత్యామ్నాయంగా, నమ్మకమైన అలారంలా పనిచేస్తుంది.

భారతదేశ సరిహద్దు అనగానే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది ముళ్ల తీగల కంచె. సినిమాలు, టీవీలో అదే చూస్తాం. కాస్త నిశితంగా పరిశీలిస్తే కంచె వెంట వేలాడుతున్న గాజు సీసాలుకూడా కనిపిస్తాయి. అవి ఎందుకు పెడతారు? వాటి వలన ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం. నిజానికి అవి చూడటానికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ అవి దేశాన్ని రక్షించడంలో ముఖ్య ప్రయోజనాన్ని అందిస్తాయి. సరిహద్దు గార్డులకు ‘హెచ్చరిక’గా పనిచేస్తాయి, వారి ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. BSF అనుసరించే ‘లో-టెక్’ భద్రతా పద్ధతుల్లో ఇది ఒకటి. సరిహద్దులో కెమెరాలు కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు దట్టమైన పొగమంచు కురిసినా అఇ పనిచేయవు. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో చలికాలంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది. కంటికి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని ఆ సమయంలో, ఈ సీసాలు ‘అలారం’లా పనిచేస్తాయి. శత్రువు కంచెను తాకిన వెంటనే వచ్చే “కిణ కిణ” మనే శబ్దమే సైనికులకు సిగ్నల్. థర్మల్ ఇమేజర్లు, సెన్సార్లు మొరాయించినప్పుడు, ఈ ఖాళీ సీసాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు. కేవలం గాలికి ఊగకుండా, ఎవరైనా తాకితేనే శబ్దం వచ్చేలా వీటిని అమర్చుతారు. ఈ సీసాలను సాధారణంగా శీతల పానీయాల ఖాళీ బాటిల్స్‌ను సేకరించి ఉపయోగిస్తారు. కేవలం శబ్దమే కాదు, రాత్రిపూట చొరబాటుదారుడు టార్చ్ లైట్ వేసినా గాజు సీసాలు ఎక్కువ కాంతిని చూపిస్తాయి. ఇది కూడా భద్రతకు అదనపు బలాన్నిస్తుంది. సరిహద్దుల్లో అత్యాధునిక సెన్సార్లు ఉన్నప్పటికీ, మన జవాన్లు ఇప్పటికీ ఈ సంప్రదాయ పద్ధతినే విశ్వసిస్తారు. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్‌ బాండ్లకు పోటెత్తిన ఇన్వెస్టర్లు

అమెరికాలో జాహ్నవి కందుల మృతికి రూ.262 కోట్ల పరిహారం

Samantha: నా ప్రతి ప్రయాణం.. సవాళ్లతోనే మొదలవుతుంది

Karthikeya 3: కార్తీకేయ3 గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Venkatesh: వరుస ప్రాజెక్ట్స్ తో విక్టరీ వెంకటేష్ జోరు.. క్యూ కడుతున్న దర్శకులు