పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
పింక్ సాల్ట్ ప్రాచుర్యం పొందినా, పోషకాహార నిపుణులు దీనిపై హెచ్చరిస్తున్నారు. వైట్ సాల్ట్‌లోని అయోడిన్ థైరాయిడ్ ఆరోగ్యానికి అత్యవసరం; పింక్ సాల్ట్ పూర్తి వాడకం అయోడిన్ లోపానికి దారితీసి థైరాయిడ్ సమస్యలు పెంచుతుంది. పింక్ సాల్ట్‌లో ఖనిజాలు ఉన్నా, అవి చాలా స్వల్పం. వంటలకు వైట్ సాల్ట్, ఇతరత్రా పింక్ సాల్ట్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోజువారీ ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యం. ఇది రుచిని పెంచడమే కాదు, శరీర పనితీరుకు కూడా అవసరం. ఇటీవల కాలంలో చాలామంది పింక్ సాల్ట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలామంది ఈ పింక్ సాల్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిదికాదంటున్నారు పోషకాహార నిపుణులు. పింక్ సాల్ట్ వాడకం పెరిగాక థైరాయిడ్ సమస్యలు ఎక్కువయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. వైట్ సాల్ట్‌లో ఉండే అయోడిన్, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు చాలా కీలకమని దాజ్‌మీత్ వివరించారు. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, వైట్ సాల్ట్‌లోని సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో, నరాల పనితీరులో, కండరాల సంకోచ వ్యాకోచాలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. పింక్ సాల్ట్‌లో 84 రకాల ఖనిజాలు ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ, అవి చాలా స్వల్ప మోతాదులో మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖనిజాల వల్ల చెప్పుకోదగ్గ ఆరోగ్య ప్రయోజనాలు ఉండవంటున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి రోజువారీ పొటాషియం అవసరం తీరాలంటే సుమారు 1.7 కిలోల పింక్ సాల్ట్ తినాల్సి ఉంటుందని చెబుతున్నారు. సాధారణ ఉప్పులో ఉండే అడిటివ్స్ వద్దనుకునే వారికి పింక్ సాల్ట్ ఒక సహజ ప్రత్యామ్నాయం మాత్రమేనని, అంతకుమించి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఆశించవద్దని స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా పింక్ సాల్ట్‌కు మారితే, అయోడిన్ కోసం సముద్రపు పాచి, పాలు, చేపలు వంటి ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడాల్సి ఉంటుందని, అందుకే, వంటల కోసం వైట్ సాల్ట్, సలాడ్ల వంటి వాటిపై చల్లుకోవడానికి పింక్ సాల్ట్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!
