అదిరేటి డ్రస్సు.. అరచేతిలో సూట్‌కేసు.. అనుమానమొచ్చి చెక్ చేయగా మైండ్ బ్లాంక్!

|

Mar 14, 2024 | 5:46 PM

స్మార్ట్‌గా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు వరంగల్ పోలీసులు. సూటూ.. బూటూ.. టిప్‌టాప్‌గా క్లాస్ లుక్‌లో తయారై.. సూట్‌కేసులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు.

స్మార్ట్‌గా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు వరంగల్ పోలీసులు. సూటూ.. బూటూ.. టిప్‌టాప్‌గా క్లాస్ లుక్‌లో తయారై.. సూట్‌కేసులో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానిక హంటర్ రోడ్ మార్గంలో గస్తీ కాశారు. ఆ మార్గం గుండా ఇద్దరు వ్యక్తులు రెండు సూట్‌కేసుల్లో గంజాయి తరలిస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 40 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on