Hyderabad: ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్

Updated on: Nov 10, 2026 | 8:34 PM

Vishnu Sahasranamam Guinness World Record: హైదరాబాద్‌లోని మచ్చింతల్‌ వేదికగా జరిగిన విష్ణు సహస్రనామ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విరాట్ పారాయణంలో సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లోని మచ్చింతల్‌ వేదికగా జరిగిన విష్ణు సహస్రనామ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ విరాట్ పారాయణంలో సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా ఈ భారీ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు ఒకేసారి విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో ఈ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు నమోదవడంపై మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని జూపల్లి రామేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ సహస్రను ఏర్పాటు చేసినట్లు రామేశ్వరరావు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us