Viral Video: ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన మహిళ… కట్‌చేస్తే ఉద్యోగం ఊస్ట్.. అసలేం జరిగిందంటే..(వీడియో)

|

Sep 22, 2021 | 4:22 PM

మనిషి జీవితలో ఏరోజు.. ఏ క్షణం ఏం జరుగుతుంతో తెలీదు. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరేలోపు అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. అలాంటిదే ఈ వీడియో. రెస్టారెంట్‌లో పనిచేసుకుంటున్న ఓ మహిళా ఉద్యోగిపై అకస్మాత్తుగా ఓ దొంగ దాడికి పాల్పడ్డాడు...

మనిషి జీవితలో ఏరోజు.. ఏ క్షణం ఏం జరుగుతుంతో తెలీదు. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరేలోపు అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. అలాంటిదే ఈ వీడియో. రెస్టారెంట్‌లో పనిచేసుకుంటున్న ఓ మహిళా ఉద్యోగిపై అకస్మాత్తుగా ఓ దొంగ దాడికి పాల్పడ్డాడు. ఊహించని సంఘటనకి షాక్‌ తిన్న మహిళ వెంటనే తేరుకొని అతనిపై ప్రతి దాడికి దిగింది. భయపడి పారిపోకుండా దొంగతో సాయశక్తులా ఫైట్‌ చేసింది. చివరికి ఆ దొంగని తరిమికొట్టింది. ఇంత చేసిన ఆ మహిళకు ఊహించని మరో షాక్‌ తగిలింది.

అమెరికాలోని ఇల్లినాయిస్‏లో స్థానికంగా ఉన్న సబ్‌వే రెస్టారెంట్‏లో అరసెలీ సోటెలో అనే మహిళ ఉద్యోగం చేస్తుంది. ఆమె విధులు నిర్వహిస్తుండగా ఆ రెస్టారెంట్‏లోకి ఓ దొంగ వచ్చాడు. తుపాకీ చూపిస్తూ.. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇవ్వమని బెదిరించాడు. దీంతో ఆ మహిళ దొంగకు ఎదురు తిరిగి, అతనితో ఫైట్‌చేసింది. దీంతో అతని చేతిలో ఉన్న రివాల్వర్ కిందపడిపోవడంతో.. వెంటనే ఆమె ఆ తుపాకీ పట్టుకుని అతడిని బెదరగొట్టింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన ఫైట్‌లో చివరకు దొంగ తోకముడిచాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది ఈ వీడియో చూసిన సదరు రెస్టారెంట్ ఓనర్స్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేశారు. ఎందుకంటే… ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంవల్ల. అయితే అది షేర్ చేసింది తను కాదని.. సదరు మహిళ ఎంత చెప్పినా వినిపించుకోలేదు రెస్టారెంట్ నిర్వాహకులు. తనకు జరిగిన అన్యాయాన్ని నెటిజన్లతో పంచుకుంది ఆ మహిళ… మహిళ ధైర్యానికి మెచ్చుకుంటూనే నెజిటన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Love Story Easwari Rao: ‘లవ్ స్టోరీ’ ఫేమ్ ఈశ్వరీరావుతో స్పెషల్ చిట్ చాట్.. ఆసక్తికరమైన విషయాలు..(వీడియో)

 New Veriyant Mosquito Bite: ఇకపై దోమ కుడితే వెంటిలేటరే… పలు రాష్ట్రాల్లో న్యూ వేరియంట్ డేంజర్ బెల్స్..(లైవ్ వీడియో)

 ప్రపంచం పై చైనా మరో బాంబ్..! ఎవర్ గ్రాండ్ దివాలా..(లైవ్ వీడియో): Ever Grand china Live updates video.

 Secret Tunnel in Lodge: సొరంగంలో వ్యభిచారం.. చూసిన షాక్ లో ఖాకీలు… కుప్పలుగా పడివున్న కండోమ్స్…(లైవ్ వీడియో).

Follow us on