Viral Video: హైవేపై కోళ్ల వ్యాన్‌ బోల్తా.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

Updated on: Dec 27, 2023 | 4:58 PM

ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రా హైవేపై కోళ్ల వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు రెచ్చిపోయారు. వ్యాన్‌ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. వాహనాలను ఆపడం.. కోళ్లను ఎత్తుకెళ్లడం కళ్ల ముందే జరిగిపోయింది. వీడియో చూడండి..

ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రా హైవేపై కోళ్ల వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు రెచ్చిపోయారు. వ్యాన్‌ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. వాహనాలను ఆపడం.. కోళ్లను ఎత్తుకెళ్లడం కళ్ల ముందే జరిగిపోయింది. పొగమంచు కారణంగా ఆ వాహనం బోల్తా పడింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగడంతో భారీ క్రేన్‌ సాయంతో ఆ వ్యాన్‌ను లిఫ్ట్‌ చేశారు. ఇదే సమయంలో హైవేపై వెళ్లున్న వాళ్లు కోళ్లను లూటీ చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.  వీడియోలో, జనం కోళ్లను లూటీ చేసేందుకు పరిగెత్తటం చూడొచ్చు. కోళ్లను సేకరించే క్రమంలో కొందరు ట్రక్కుపైకి ఎక్కడం కనిపించింది. కొందరు ఏకంగా కోళ్లను బస్తాల్లో నింపుకుని పరుగులు తీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Dec 27, 2023 04:54 PM
Loading...
Unable to load recommendations.
Follow Us