ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పుడుతూనే మీసాలతో పుట్టాడుగా!

Updated on: Oct 28, 2026 | 11:19 AM

సోషల్‌ మీడియాలో మీసాలతో పుట్టిన శిశువుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న చిన్నారికి దట్టమైన నల్ల మీసాలు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇది నిజమైన వీడియోనా లేక ఏఐ సాయంతో రూపొందించారా అనే చర్చ జరుగుతోంది. పుట్టిన శిశువులపై కనిపించే లానుగో వెంట్రుకలు సాధారణంగా పలుచగా ఉంటాయి. ఈ వీడియోకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ అందుబాటులో లేదు.

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నిజమా? లేక ఎడిటింగ్ చేసిందా? అనే దానిపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓ శిశువు అటూ ఇటూ కదులుతూ కనిపిస్తున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా… ఉంది.. ఆ చిన్నారి పుడుతూనే మీసాలతో పుట్టాడు మరి. విశేషమే కదా.. ఓ మహిళ ఆ చిన్నారిని పలకరిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘పుట్టగానే బాధ్యతలు నెత్తికెత్తుకున్న మధ్యవయస్కుడిలా ఉన్నాడు’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియో ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొంతమంది శిశువులు పుట్టినప్పుడు వారి శరీరంపై ‘లానుగో’ అనే సన్నని వెంట్రుకలు ఉంటాయి. కానీ, అవి చాలా పలుచగా, లేత రంగులో ఉంటాయి. వీడియోలో కనిపిస్తున్నంత దట్టంగా, నల్లగా ఉండవని వైద్యులు చెబుతున్నారు. వీడియోను నిశితంగా పరిశీలించిన కొందరు, శిశువు కదులుతున్నప్పుడు మీసం స్థిరంగా లేకపోవడం, లైటింగ్‌కు తగ్గట్టుగా నీడలు సరిగ్గా లేకపోవడం వంటివి గమనించారు. ఈ కారణాలతో నిజమైన వీడియోపై ఏఐ ఫిల్టర్ లేదా డిజిటల్ ఓవర్‌లే ఉపయోగించి దీనిని సృష్టించి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ గానీ, కుటుంబ సభ్యుల వివరాలు గానీ అందుబాటులో లేవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఎక్స్‌’లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క లైక్‌తో నేరుగా డబ్బులు పంపొచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us