Viral video : నక్కనుంచి ఎరను లాక్కున్న చిరుత.. ఆతర్వాత ఏంచేసిందంటే.. వీడియో వైరల్

|

Mar 13, 2021 | 4:23 AM

సోషల్ మీడియాలో, అడవి జంతువుల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి, నిత్యం ఎన్నో జంతువులకు సంబంచిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఒళ్లుగగుర్లు పొడిచేవిగాను ఉంటాయి.

Viral video : నక్కనుంచి ఎరను లాక్కున్న చిరుత.. ఆతర్వాత ఏంచేసిందంటే.. వీడియో వైరల్
Fox
Follow us on

Fox vs Leopard : సోషల్ మీడియాలో, అడవి జంతువుల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి, నిత్యం ఎన్నో జంతువులకు సంబంచిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఒళ్లుగగుర్లు పొడిచేవిగాను ఉంటాయి. అయితే తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి ప్రతిఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంతకు అదేంటంటే ఒక చిరుత వేట.  అయితే ఈ వేట మాత్రం కాస్త వెరైటీ.  అడవి మృగాలు తమ ఎరను వేటాడడమే కాదు.. కొన్నిసార్లు వేరే జంతువులదగ్గరనుంది లాక్కుంటూ ఉంటాయి.

ఒక నక్క జంతువును వేటాడింది, ఆ తర్వాత ఆ నక్కా వేట దొరికిందికదాహాయిగా తిందాం అనుకునేలోగా సడన్ గా ఒక చిరుత దాన్ని వెంబడించింది. ఆ తర్వాత చిరుతపులి నక్కపై దాడి చేస్తుంది. అంతటితో ఆ చిరుత ఆగలేదు ఆ నక్కదగ్గరనుంచి ఆహారాన్ని లాక్కుంది.  కాని నక్క మాత్రం ఆ చిరుతను ఎదిరించింది. దాంతో ఆచిరుత అక్కడినుంచి ఆహారాన్ని తీసుకొని పరిగెత్తడం మొదలు పెట్టింది. ఇక నక్క వదలకుండా వెంబడించడంతో టక్కున ఒక చెట్టు ఎక్కేసింది ఆ చిరుత.

కానీ ఏంచేస్తాం నక్క చెట్టు ఎక్కలేదుగా.. చేసేదేమి లేక అలా చూస్తూ ఉండిపోయింది. చిరుత మాత్రం ఎంచక్కా చిటారుకొమ్మకు చేరుకొని హాయిగా ఆ ఎరను ఆరగించింది. ఈ ఫన్నీ వీడియోను  లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ లో షేర్చే చేసారు. ఎర కోసం  నక్క చిరుతపులి పోట్లాడుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ఈ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఇప్పటికే ఈ వీడియోకు ఊహించని వ్యూస్, లక్షల్లో లైకులు వస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అంగారకుడిపై శబ్దాలను రికార్డ్ చేసిన పర్సెవరెన్స్ రోవర్.. ఈ ఆడియో ద్వారా ఆసక్తికర నిజాలు వెల్లడిస్తున్న సైంటిస్టులు

Trump Buddha Statues: డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు