జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు
మధురలో చెప్పులతో కొట్టుకుంటూ, కర్నూలులో పురుషులు చీరలు ధరించి హోలీ జరుపుకోవడం వింతైన ఆచారాలు. మధురలో దుష్టశక్తుల నివారణకు చెప్పు దెబ్బల హోలీ, కర్నూలులో పంటలు, ఇంటి శ్రేయస్సు కోసం పురుషులు మహిళల వేషంలో రతీ మన్మథులను పూజిస్తారు. ఈ వందల ఏళ్ల సంప్రదాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, దేశవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
హోలీ అంటే కాముని దహనం, రంగులు చల్లుకోవడం ఇదే కదా! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఆ వింత హోలీ ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి ప్రజలు రంగులు చల్లుకుంటూనే, ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకుంటూ హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వల్ల గ్రామంలోని దుష్టశక్తులు నశిస్తాయని స్థానికుల నమ్మకం. ఈ ఆచారాన్ని ఆ గ్రామస్తులు వీడియో తీసి నెట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చెప్పు దెబ్బల హోలీ ట్రెండింగ్ గా నిలుస్తోంది. ఇదేం వింత ఆచారం బాబోయ్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే గ్రామంలో జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం మీకు కనిపిస్తుంది. ఇది వందల ఏళ్లుగా కంటిన్యూ అవుతోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని మహిళ్లలా సింగారించుకుంటారు. రతీమన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని, ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఏటా హోలీ పండుగ నాడు ఈ వింత ఆచారాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు, మొక్కులు చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్
Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు
Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు
తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు
Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్
