రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం
కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన చిన్నారికి భారతీయ రైల్వే సిబ్బంది సకాలంలో వైద్య సహాయం అందించారు. బెంగళూరు నుంచి గుజరాత్‌కు ప్రయాణిస్తున్న తల్లికి టీటీఈ ద్వారా సమాచారం అందగానే, రైల్వే అధికారులు వేగంగా స్పందించి హిందూపూర్ స్టేషన్‌లో వైద్యుడిని సిద్ధం చేశారు. చిన్నారికి చికిత్స అందించి ప్రాణం నిలిపినందుకు తల్లి కృతజ్ఞతలు తెలుపగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే సిబ్బంది సేవలను నెటిజన్లు ప్రశంసించారు.
కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్‌కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఘటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన ఆ తల్లి.. పాపకు మునగకాయ సూప్ తాగించింది. అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే TTEను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్‌కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి సరైన బిల్లు కూడా ఇవ్వడం గమనార్హం. “నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రయాణాల్లో ఇలాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కంగారు పడకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో 25 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు రైల్వే సిబ్బంది సేవలను కొనియాడుతూ “రైల్వే సిబ్బందికి సెల్యూట్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ