Funny Video: యజమానిని కుమ్మేసేందుకు దూసుకొచ్చిన గొర్రె.. చాకచక్యంగా తప్పించుకున్న వ్యక్తి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

|

Feb 09, 2022 | 9:59 AM

సాధారణంగా... గొర్రెలు కూల్‌గా ఉంటాయి. ఎవరి జోలికీ వెళ్లకుండా...వాటి పాటికి అవి మేత మేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం భయంకరంగా ఉంటాయి. తాజాగా కోపంతో ఊగిపోయిన గొర్రెకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సాధారణంగా… గొర్రెలు కూల్‌గా ఉంటాయి. ఎవరి జోలికీ వెళ్లకుండా…వాటి పాటికి అవి మేత మేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం భయంకరంగా ఉంటాయి. తాజాగా కోపంతో ఊగిపోయిన గొర్రెకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపంతో ఉన్న గొర్రె.. వ్యక్తిని కుమ్మేంసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అది గమనించిన వ్యక్తి దాని నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. గొర్రె పరుగెత్తుకుంటూ రాగా, అతను దానిపై నుంచి ఒక్కసారిగా జంప్ చేశాడు. అలా గుర్రెను బకరా చేసి.. తాను సేఫ్ అయ్యాడు. కానీ, గొర్రె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు మూడు సార్లు ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది.
ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Follow us on