Viral Video: కోడిపుంజు, పెట్టను విడదీసిన యజమాని.. మరి పుంజు ఊరుకుంటుందా? ఓ రేంజ్‌లో… వీడియో వైరల్

|

Dec 15, 2021 | 9:58 AM

సోషల్ మీడియాలో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో భాగంగా కోళ్లకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చాలానే చూసి ఉంటారు.. వాటి పెంపకం దగ్గర్నుంచి.. గుడ్లు పొదగడం.. పిల్లల్ని ...


సోషల్ మీడియాలో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో భాగంగా కోళ్లకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చాలానే చూసి ఉంటారు.. వాటి పెంపకం దగ్గర్నుంచి.. గుడ్లు పొదగడం.. పిల్లల్ని కాపాడుకునేందుకు కోళ్లు చేసే పోరాటాలకు సంబంధించి అనేక వీడియోలు ఉంటారు..అయితే, ఇది మాత్రం నిజంగా నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి..ఎందుకంటే…. తన సహచర కోడి పెట్ట కోసం.. ఓ పుంజు వాటి యజమానితో మినీ యుద్దమే చేసింది. అవాంతరాలు అధిగమించి.. కాస్త తెలివితేటలు ఉపయోగించి .. తన ప్రియతమ పెట్టను చేరుకుంది.ఇదిగో ఇక్కడ కోడిపెట్టను చేతిలో పట్టుకున్న వ్యక్తి వీటి యజమాని..పక్కనే కోడి పుంజు కూడా ఉంది..అయితే, కోడిపుంజు, పెట్టను కలవనీయకుండా అతడు అడ్డుపడ్డాడు. దాంతో కోపం వచ్చిన కోడి పుంజు అతన్ని ఎగిరి ఎగిరి మరీ పొడవసాగింది..అయిన కూడా అతడు..ఆ కోడిపెట్టను పట్టుకుని పక్కనే ఉన్న గూట్లో పెట్టేసి గడియ మాదిరిగా ఓ చిన్న కట్టెపుల్లను అడ్డుగా పెట్టేశాడు..ఇక కోడి పుంజు, పెట్ట కలుసుకోవాలని ధీమాగా ఉన్నాడు..కానీ, పుంజు వెరీ క్లేవర్‌ అనుకుంటా…కోళ్ల గూటి గడియకు పెట్టిన కట్టెపుల్లను తన ముక్కుతో తీసి అవతల పారేసింది..అటు తర్వాత తిన్నగా తన పెట్టను చేరుకుంది..ఈ ఫన్నీ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

Follow us on