రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో
ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగులు బాగా పనిచేస్తేనే జీతంతోపాటు ఇంక్రిమెంట్లు, బోనస్‌లు వంటివి ఇస్తామని చెబుతుంటాయి. కానీ చైనాలోని ‘గ్వాంగ్ డాంగ్, డాంగ్‌పో’ పేపర్ కంపెనీ మాత్రం అందరూ ఆశ్చర్యపోయే ప్రకటన చేసింది. ‘రన్నింగ్ చేయండి, ఫిట్‌గా ఉండండి, జీతంతో పాటు బోనస్ పొందండి’ అంటూ ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది.
ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతుంది. రన్నింగ్‌కు బోనస్‌కు లింక్ పెట్టడం వెనుక తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటమే అసలు ఉద్దేశమని గ్వాంగ్ డాంగ్, డాంగ్‌పో కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఇక బోనస్ ఇచ్చే విషయానికి వస్తే, ఉద్యోగులు నెలకు 100 కిలోమీటర్లు పరిగెత్తితే, వారికిచ్చే శాలరీలో 130% బోనస్‌గా పొందవచ్చు. 50 కిలోమీటర్లు పరిగెత్తితే 100% బోనస్, 40 కిలోమీటర్లు పరిగెత్తితే 60% బోనస్, 30 కిలోమీటర్లు పరిగెత్తితే 30% బోనస్ లభిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇంతకంటే తక్కువ పరిగెత్తిన వారికి అసలు బోనసే ఉండదు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా, ఇది సరైంది కాదని కొందరు, ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచించడం గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కస్టమ్స్ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో
సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో
మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్‌కు బాలుడు విజ్ఞప్తి వీడియో