కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!

Updated on: Oct 26, 2026 | 1:38 PM

పంజాబ్‌లోని కోట్‌కపురాకు చెందిన బిమ్లా దేవిని కేవలం రూ.7తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ కోటీశ్వరురాలిని చేసింది. దినసరి కూలీగా పనిచేసే భర్త సంపాదనతో కుటుంబాన్ని నడిపిస్తున్న ఆమెకు సిక్కిం ప్రభుత్వ లాటరీలో రూ.కోటి జాక్‌పాట్‌ తగిలినట్లు కథనం పేర్కొంది. ఈ గెలుపుతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకుని, చిన్న వ్యాపారం ప్రారంభించాలని బిమ్లా దేవి భావిస్తున్నారు.

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. పంజాబ్‌లోని కోట్‌కపురా ప్రాంతానికి చెందిన బిమ్లా దేవి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబం నెట్టుకొస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిమ్లా దేవి తన పిల్లల కోసం బట్టలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాటరీ స్టాల్ వద్ద సరదాగా కేవలం రూ.7 పెట్టి సిక్కిం ప్రభుత్వ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఆ చిన్న టికెట్ తమ తలరాతను మారుస్తుందని అప్పుడు ఆమెకు తెలియదు. కానీ సరదాగా తీసుకున్న ఆ టికెటే ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. మరుసటి రోజు లాటరీ ఫలితాలు వెలువడ్డాయి. బిమ్లా దేవిని కోటి రూపాయల జాక్‌పాట్ వరించింది. లాటరీ స్టాల్ నిర్వాహకుడు నరేశ్‌ మోంగా స్వయంగా ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే లాటరీ స్టాల్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుంటూ భాంగ్రా నృత్యం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపు తమ జీవితంలో కొత్త ఆశలు నింపిందని, పిల్లల భవిష్యత్తుకు చక్కటి భరోసా లభించిందని బిమ్లా దేవి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చిన డబ్బుతో కుటుంబ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభిస్తామని తెలిపారు. ఆరు నెలల కిందట ప్రారంభించిన తమ లాటరీ స్టాల్‌లో కోటి రూపాయల బహుమతి రావడం ఇదే మొదటిసాని నిర్వాహకుడు నరేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్లు, బస్సులే కాదు ఇకపై రైళ్లు కూడా ఆన్‌లైన్‌లో అద్దెకు!

ఒకసారి వెలిగించిన ప్రమిదను.. మళ్లీ పూజకు వాడొచ్చా?

Loading...
Unable to load recommendations.
Follow Us